నేరేడుచర్లలో ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవo
19-08-2026 01:10 PM
నేరేడుచర్ల, ఆగస్టు19(విజయక్రాంతి): నేరేడుచర్ల మండల ఫోటోగ్రఫి యూనియన్ ఆధ్వర్యంలో 187వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలను నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా యూనియన్ మండల అధ్యక్షులు మచ్చ రవి జండా ఆవిష్కరణ చేసి లూయిస్ డాగురె కు నివాళులు అర్పిoచారు. ఈ కార్యక్రమంలో సూర్యపేట జిల్లా గౌరవ సలహాదారులు శ్రీనివాసచారి,మండల అధ్యక్షులు శ్రీరాములు, సీనియర్ ఫోటోగ్రాఫర్లు గణేష్ శ్రీనివాస్ రెడ్డి గౌస్ బెంజిమెన్ మనోహర్ అబ్రహం సందీపు శంకరు చరణ్ మధుబాబు బుచ్చిబాబు బాలస్వామి వినయ్ తదితర ఫోటోగ్రాఫర్లు పాల్గొన్నారు.






