19 August, 2026 | 2:08 PM

ఫోటోగ్రాఫర్లకు ఘన సన్మానం

19-08-2026 01:16 PM

ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని లయన్స్ క్లబ్ ఆఫ్ ఆసిఫాబాద్ ఆధ్వర్యంలో స్థానిక ఫోటోగ్రాఫర్లను ఘనంగా సన్మానించారు. ఫోటోగ్రఫీ రంగంలో విశేష సేవలందిస్తున్న వారిని శాలువాలు కప్పి సత్కరించారు.ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న అనేక సంఘటనలను చిత్రాల రూపంలో ప్రజలకు చేరవేయడంలో ఫోటోగ్రాఫర్ల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. ఫోటోగ్రాఫర్ల సేవలను కొనియాడుతూ వారికి అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో లయన్ అబ్దుల్ ఫయాజ్ (క్యాబినెట్ మెంబర్), లయన్ శంకర్ (క్లబ్ అడ్మినిస్ట్రేటర్), లయన్ బోయిరే ప్రకాష్ (సెక్రటరీ) పాల్గొన్నారు.