19 August, 2026 | 2:21 PM

హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ద్వితీయ వార్షికోత్సవం

19-08-2026 01:14 PM

నేరేడుచర్ల,ఆగష్టు 19(విజయక్రాంతి): నేరేడుచర్ల మండల కేంద్రం లోని అయ్యప్ప స్వామి దేవాలయంలో(Ayyappa Swamy) బుధవారం నాడు ఘనంగా అయ్యప్ప స్వామి ద్వితీయ వార్షికోత్సవ నిర్వహించారు. అయ్యప్ప స్వామి వార్షికోత్సవం సందర్భంగా గణపతి పూజ హోమం అభిషేకాలు ప్రత్యేక పూజలు అయ్యప్ప స్వామి గుడి కమిటీ చైర్మన్ కొణతం కృష్ణారెడ్డి సంధ్య దంపతుల వారి కుమారుడు శివ చరణ్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా ద్వితీయ వార్షికోత్సవం నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో , మున్సిపల్  చైర్మన్ కొణతం చిన్న వెంకటరెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నాగండ్ల శ్రీధర్, విజయ దుర్గా దేవి ఆలయ కమిటీ చైర్మన్ కోనతం ఆదిరెడ్డి, శ్రీ వాణి స్కూల్ డైరెక్టర్ ఎంబీఏ సీతారాం రెడ్డి, మున్సిపల్ రెండో వార్డ్ కౌన్సిలర్ లక్ష్మి శ్రీనివాస్, కొనతం చిన్న సీతారాం రెడ్డి అఖిలభారత అయ్యప్ప దీక్ష ప్రసార సమితి చిన్న పల్లి శ్రీనివాస్, ఐల శ్రీనివాస్, ఒంటెద్దు ప్రభాకర్ రెడ్డి,పంగ శ్రీనివాస్, పోనుగోటి జంగయ్య పూర్ణచంద్రారెడ్డి ,లక్ష్మారెడ్డి, మచ్చ శ్రీను, ఆకారపు వెంకటేశ్వర్లు, దుర్గారావు, కిషోర్ ,సురేష్, శంకరాచారి, కోనతం శివశరణ్ రెడ్డి, మల్లారెడ్డి ,రామిరెడ్డి, సాయిరాజ్, సుక్కి నితిన్ రెడ్డి, గిరి,పోనుగోటి శ్రీనివాస్ రావు, యశ్వంత్, రామ నర్సమ్మ, విజయమ్మ, సీతమ్మ, నాగేష్, దుర్గాప్రసాద్, శేఖర్, సరిత, స్వాతి, రాంబాబు, రామకృష్ణ, జొన్నలగడ్డ సైదులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థప్రసాదాలు అందించడం జరిగింది