19 August, 2026 | 6:49 PM

ఆలయాల అభివృద్ధికి కృషి

19-08-2026 04:28 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ మున్సిపల్ పరిధిలోని ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తానని మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి అన్నారు. బుధవారం పట్టణంలోని బంగాల్పేట్ లో డబుల్ బెడ్‌రూమ్ ఆంజనేయ స్వామి గణపతి, శ్రీ శివుడు, శ్రీ అన్నపూర్ణదేవి, శ్రీ నందీశ్వరుడు, శ్రీ నాగదేవత విగ్రహ ప్రతిష్టాపన పూజలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు లక్కాకుల హరీష్, గుంజాల చైతన్య, మాజీ కౌన్సిలర్ తోట నర్సయ్య మరియు కాలనీ వాసులు రవి, ప్రకాష్, సంతోష్, రాజు తదితరులు పాల్గొన్నారు.