19 April, 2026 | 11:22 AM

మంత్రి ఉత్తమ్ సహకారంతో మున్సిపల్ అభివృద్ధికి కృషి

19-04-2026 09:26 AM

మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్, వైస్ చైర్మన్ తన్నీరు మల్లికార్జునరావు

హుజూర్ నగర్: హుజూర్ నగర్ మున్సిపాలిటీ లోని 28 వార్డులలో ప్రధాన సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్, వైస్ చైర్మన్ తన్నీరు మల్లికార్జునరావు తెలిపారు. శనివారం పట్టణంలోని 2వ సాధారణ మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్ర పౌరసరఫరాల, నీటిపారుదల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో హుజూర్ నగర్ పట్టణాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు. మిషన్ భగీరథ నీరు అందించేందుకు  సిబ్బంది ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. వేసవిలో నీటి ఎద్దడి రాకుండా తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ శ్రీనివాస్,  కౌన్సిలర్లు, సిబ్బంది, పాల్గొన్నారు.