calender_icon.png 9 February, 2026 | 9:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

12న సమ్మెకు దూరంగా ఉండాలని

09-02-2026 07:40:21 PM

- మందమర్రి జీఎం రాధాకృష్ణ పిలుపు..

బెల్లంపల్లి,(విజయక్రాంతి): దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సింగరేణిలో 12 న కార్మిక సంఘాలు తలపెట్టిన సమ్మెకు కార్మికులు దూరంగా ఉండాలనీ మందమర్రి జిఎం జీఎం ఎన్ రాధాకృష్ణ కోరారు. సోమవారం జి.ఎం కార్యాలయంలో  ఒకరోజు సమ్మెకు  సంబంధించి ఏరియా అధికారులతో సమీక్ష సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కొన్ని కార్మిక సంఘాలు ఈ నెల 12 వ తేదీన తలపెట్టిన ఒకరోజు సమ్మెకు దూరంగా ఉండాలని అన్నారు. విధులకు హాజరై విధులకు హాజ రై లక్ష్య సాధనలో భాగస్వాములు  కావాలని కోరారు.

కొన్ని జాతీయ కార్మిక సంఘాలు తలపెట్టిన  సమ్మె  డిమాండ్లలో అత్యధికం సింగరేణి కార్మికులకు  సంబంధించినవే కావని పేర్కొన్నారు. సింగరేణి యాజమాన్యం తీర్చగలిగినవి కూడా కావనీ స్పష్టం చేశారు. సింగరేణి సంస్థ పరిధిలోని సమస్యలు ఉంటే చర్చల ద్వారా పరిష్కరించుకునే అవకాశం కలదనీ, సింగరేణి కార్మికులు ఈ సమ్మెలో పాల్గొనవలసిన అవసరం ఉందా? ఆలోచించాలని కోరారు. వివిధ కారణాల వలన ఈ ఆర్థిక సంవత్సరం, నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి ఓవర్ బర్డెన్ తొలగింపులో కొంత వెనుకబడి ఉన్నామని, ఈ సమయంలో లక్ష్యసాధనకు ప్రతీ రోజు సాధించే ఉత్పత్తి కూడా ఎంతో తోడ్పాటునందిస్తుందనున్నారు.

నిరంతరాయంగా విద్యుత్ సరఫరా జరగడానికి నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి సాధించి, రవాణా చేస్తూ సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉందనీ తెలిపారు. ఒక్కరోజు సమ్మె చేస్తే,కంపెనీకి కలిగే ఉత్పత్తి నష్టం విలువ  రూ.77 కోట్ల వరకు ఉంటుందన్నారు. అలాగే కార్మికులు కోల్పోయే వేతనాలు సుమారు రూ.12 కోట్లు ఒక్క రోజు ఉత్పత్తి నష్టం –2.20 లక్షల టన్నులు ఉంటుందని చెప్పారు. గత ఆర్థిక సంవత్సరం 2024-25లో 69.01 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి, 65.27 మిలియన్ టన్నుల బొగ్గు రవాణా జరిగినదన్నారు. లాభాల బోనస్, పిఎల్ఆర్ బోనస్లు ఉద్యోగులకు చెల్లించడం జరిగినదనీ తెలిపారు.

ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు మనం సుమారు 49 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించామనీ, మిగిలిన 23 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని లక్ష్య సాధనకై ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిన రెండు నెలలు ప్రతీ రోజు శ్రమించాల్సి ఉందనీ గుర్తు చేశారు. కనుక 12వ తేదీన తలపెట్టిన సమ్మెకు దూరంగా ఉండి, విధులు నిర్వహించాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. సమావేశంలో ఎస్ఓ టు జిఎంజిఎల్ ప్రసాద్, KKOC ప్రాజెక్టు ఆఫీసర్ మల్లయ్య, ఏరియా ఇంజనీర్ E&M బాలాజీ భగవతి జ, కేకే గ్రూప్ ఏజెంట్ రాంబాబు, ఎస్.కె గ్రూప్ ఏజెంట్ ఖాదీర్, మందమర్రి ఏరియా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.