calender_icon.png 9 February, 2026 | 9:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా అన్ని ఏర్పాట్లు

09-02-2026 07:35:33 PM

జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

కామారెడ్డి,(విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. సోమవారం నోడల్ అధికారులతో కలెక్టరేట్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. డిస్ట్రిబ్యూషన్, పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలపై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలలో కామారెడ్డి, ఎల్లారెడ్డి, బిచ్కుంద, బాన్సువాడ మున్సిపార్టీలలో పోలింగ్ సామగ్రి పంపిణీ సమయంలో చెక్‌లిస్టుల ప్రకారం సరైన పరికరాలు అందజేయాలి.

పోలింగ్ రోజున ఓటర్లకు ఇబ్బందులు లేకుండా అన్ని పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు, భద్రతా, గట్టి బందోబస్తు ఏర్పాట్లు ఉండేలా చూడాలని తెలిపారు. పోలింగ్ ముగిసిన వెంటనే బ్యాలెట్ బాక్సులను భద్రతతో స్ట్రాంగ్ రూంలకు తరలించి, కౌంటింగ్ రోజున నిబంధనల ప్రకారం ఓట్ల లెక్కింపు జరగాలని స్పష్టం చేశారు.

కౌంటింగ్ హాలులో టేబుల్ ఏర్పాటు, కౌంటింగ్ సిబ్బంది ఏర్పాట్లు, భద్రత చర్యలు, త్రాగునీరు ,కౌంటింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, బ్యారికేడ్లు వంటి భద్రతా చర్యలు కట్టుదిట్టంగా అమలు చేయాలని, కౌంటింగ్ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలన్నారు. ఎన్నికల విధులు నిర్వహించే అధికారులంతా బాధ్యతతో పనిచేసి ఎన్నికలను విజయవంతం చేయాలని కలెక్టర్ తెలిపారు.

 మంగళవారం ఎన్నికల అధికారులు సకాలంలో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకు చేరుకొని తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలని, ఎన్నికల సామగ్రిని సరిచూసుకోవాలని ఉదయం 7.00 గంటలకే డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకు చేరుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో  సాధారణ పరిశీలకులు ప్రశాంత్ కుమార్, అదనపు కలెక్టర్లు విక్టర్,  మధుమొహాన్, వివిధ శాఖల నోడల్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.