కార్మికుల మద్దతు కాంగ్రెస్ ప్రభుత్వానికే
స్పష్టం చేసిన జలమండలి ఫలితాలు
టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్యెల్సీ మహేష్ కుమార్ గౌడ్
ముషీరాబాద్, జూన్ 7 (విజయక్రాంతి): జలమండలి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల ఫలితాలు కార్మికులు, ఉద్యోగుల మద్దతు కాంగ్రెస్ ప్రభుత్వానికే ఉందని స్పష్టం చేస్తున్నాయని టీపిసిసి అధ్యక్షులు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. జలమండలి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో అధ్యక్షునిగా ఘన విజయం సాధించిన మొగుళ్ల రాజిరెడ్డికి ఆదివారం గాంధీభవన్ లో అభినందన సభ నిర్వహించారు.
ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ జలమండలి గుర్తింపు కార్మిక సంఘ ఎన్నికల్లో పాల్గొని తెలంగాణ జలమండలి ఎంప్లాయిస్ యూనియన్ కు ఓటు వేసి గెలిపించిన కార్మిక సోదరిసోదరులందరికీ అభినందనలు తెలిపారు. ఐఎన్టీయూసీ ద్వారా కాంగ్రెస్ జెండాను ఎగరేశామని, రానున్న జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ విజయపతాకం ఎగరవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మొగుళ్ల రాజిరెడ్డి మాట్లాడుతూ తన విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.
సిఎం రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్ తదితరులు తనకు పూర్తి సహాయ సహకారాలు అందించారని పేర్కొన్నారు.
ఈ సభలో ఐఎన్టీయూసీ ఇంచార్జి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఆర్.డి. చంద్రశేఖర్, వై. నాగన్న గౌడ్, అదిల్ షరీఫ్, టిజెఈయు ప్రధాన కార్యదర్శి కె. రాఘవేంద్ర రాజ్, అసోసియేట్ ప్రెసిడెంట్ అల్లి శ్రావణ్ కుమార్, వాటర్ వరక్స్ ఎంప్లాయిస్ యూనియన్ తెలంగాణ అధ్యక్షులు కె. రాజి రెడ్డి, నేతలు ఇ.చంద్రశేఖర్, ఎం.రాజా, బి.శంకర్ ప్రకాష్, బి.నర్సింగ్ రావు, కె.ఆనంద్ రెడ్డి, అజయ్ నాథ్, వినోద్ గౌడ్, శ్రీనివాస్ యాదవ్, సైద్ హాసిం, ఇందూరి తిరుపతి, గౌస్ పాషా, బి. అశోక్, ఏ. అశోక్, మొగులయ్య, రవీందర్, లక్ష్మణ్ యాదవ్, ఆర్.వెంకటేష్, షేర్ బహదూర్, సాయిలు, శ్యామ్, అబ్దుల్ రవూఫ్, ప్రవీణ్ కుమార్, బి.మహేష్, వేణు, రంగయ్య, రాజేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.






