1 August, 2026 | 3:19 PM

బాధిత కుటుంబాలకు కేకే పరామర్శ

01-08-2026 02:15 PM

అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం: కేకే మహేందర్ రెడ్డి

గంభీరావుపేట, ఆగస్టు 01 (విజయక్రాంతి): బాధిత కుటుంబాలు అధైర్యపడవద్దని, తాము అండగా ఉంటామని కాంగ్రెస్ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి తెలిపారు.శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో ఇటీవల జరిగిన ఘటనల్లో బాధితులను ఆయన పరామర్శించారు. రోడ్డు ప్రమాదంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ కోటలింగం కుమారుడు అనిల్ మృతిచెందిన నేపథ్యంలో, ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు.

అనంతరం విద్యుత్ షాక్‌కు గురైన జిల్లా కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు మల్యాల రాజ్వీర్‌ను పరామర్శించి, ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మాజీ మండల అధ్యక్షుడు హమీద్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఏడబోయిన ప్రభాకర్,నాయకులు పాపగారి రాజు, వేషాల వెంకటి, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.