గంధంగూడలో ధ్వంసమైన రోడ్లకు మరమ్మతులు చేయాలి
కాంగ్రెస్ ప్రజా పాలనలో అధ్వానంగా రోడ్లు డ్రైనేజీలు...
రావుల కోళ్ల నాగరాజు బండ్లగూడ బి అర్ ఎస్ అధ్యక్షుడు...
రాజేంద్ర నగర్ ఆగస్టు 1 (విజయక్రాంతి): గంధం గూడ ఫీల్ గుడ్ హోమ్స్ కాలనీలో వర్షానికి రోడ్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయని జిహెచ్ఎంసి రాజేంద్రనగర్ సర్కిల్ అధికారులు స్పందించి వెంటనే రోడ్లపై ఏర్పడిన గుంతల కు మరమ్మతులు చేయించాలని బండ్లగూడ బి అర్ ఎస్ అధ్యక్షుడు రావుల కోళ్ల నాగరాజు రాజేంద్రనగర్ సర్కిల్ జిహెచ్ఎంసి అధికారులకు విజ్ఞప్తి చేశారు . వివిధ కాలనీలో గుంతల మాయమైన రోడ్ల తో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బి అర్ ఎస్ కార్యకర్తలతో కలిసి శుక్రవారం క్షేత్రస్థాయిలో ఆయా కాలనీలలో బి అర్ ఎస్ నాయకులు పర్యటించారు . రోడ్ల దుస్థితి గురించి పలు మార్లు జిహెచ్ఎంసి అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని
121, 122, 123 డివిజన్లలో కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉందనీ. వెంటనే ప్యాచ్ వర్క్ లు చేపట్టి, శాశ్వతంగా రోడ్ల నిర్మాణ పనులు చేపట్టాలని రాజేంద్రనగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ను వారు కోరారు లేనిపక్షంలో ప్రజలతో కలిసి బి అర్ ఎస్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున జిహెచ్ఎంసి కార్యాలయాన్ని ముట్టడిస్తామని వారు హెచ్చరించారు కాంగ్రెస్ ప్రజా పాలనలో కనీసం రోడ్లను కూడా బాగు చేయలేని పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదని వారు విమర్శించారు . అనంతరం రోడ్లపై ఏర్పడిన గుంతల దగ్గర మట్టి వేసిన బి అర్ ఎస్ నాయకులు తాత్కాలిక మరమ్మత్తు చేశారు .ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు






