1 August, 2026 | 3:19 PM

అంపశయ్యపై బెల్లంపల్లి ఆర్టీసీ బస్టాండ్

01-08-2026 02:14 PM

బుంగ ను పరిశీలించిన ఎమ్మెల్యే వినోద్.. 

బుంగ చుట్టూ రక్షణ ఏర్పాట్లు

తాత్కలికంగా బస్సులు రాకపోకలు 

నిలిపివేత కు ఆర్టీసీ డీఎం రాజశేఖర్ ఆదేశాలు

బెల్లంపల్లి, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఆర్టీసీ బస్టాండ్(Bellampalli RTC bus stand) అంపశయ్యపై ఉంది. దశాబ్దాల క్రితం బెలoపల్లి కొత్త బస్టాండ్ ను ఏర్పటు చేశారు. అనూహ్యంగా బస్టాండ్ లో భారీ బుంగ ఏర్పడటంతో ప్రమాదకర పరిస్థితి నెలకొంది. ఈ సంఘటన ప్రజలను ఒక్కసారిగా భయబ్రాంతులకు గురిచేసింది. బస్టాండ్ కింద నుంచి పలు బొగ్గు గనుల తవ్వకాలు జరిగినట్టు తెలుస్తోంది. భూ గర్భ గనుల మూత తర్వాత ఇసుక నింపుతారు. అధికారుల మూసిన గనుల్లో తగిన ఇసుక నింపు క పోవడం వల్లనే ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.ఎమ్మెల్యే గడ్డం వినోద్, మునిసిపల్ చైర్ పర్సన్ దావస్వాతి, ఆసిఫాబాద్ డీఎం రాజశేఖర్ పరిశీలించారు.

బుంగ పడటంతో బస్టాండ్ ను తరలించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. బుంగ  పడిన ఆ ప్రాంతం సురక్షితం కాదు. ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఘటన స్థలాన్ని పర్యటించారు. సింగరేణి మందమర్రి జిఎం రాధాకృష్ణ మాట్లాడి బుంగ పడిన అప్రాంతాన్ని సర్వేచేయాలని చెప్పారు. బుంగ పడిన బస్టాండ్ లో రక్షణ చర్యలు చేపట్టాలని ఆర్టీసీ డీఎం రాజశేఖర్ ను ఆదేశించారు. వెంటనే అధికారులు బుంగ చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు.ఈ క్రమంలో ప్రయాణికుల  రక్షణ కోసం ఆర్టీసీ బస్సుల రాకపోకలను నిలిపివేయాలని  ఎమ్మెల్యే ఆదేశించారు. బస్సుల దారిమళ్లింపుకు డీఎం రాజశేఖర్ ఆదేశాలు ఇచ్చారు. ఏదేమైనా బెల్లంపల్లి ఆర్టీసీ బస్టాండ్  ప్రమాదపు హుబిలో ఉంది. బస్టాండ్ ను శాశ్వతంగా ఎత్తి వేసి పట్టణంలో మరొక చోట ఏర్పాటు అన్ని విధాల శ్రేయస్కరమని ప్రజలు అభిప్రాయ పడుతున్నారు.  ఏమి చేస్తారో చూడాలి మరి.