మంత్రి పదవి ఇవ్వకపోతే రాజీనామా!
- హైకమాండ్‌కు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే రంగారెడ్డి అల్టిమేటం
- కాంగ్రెస్‌లో కేబినెట్ హీట్
రంగారెడ్డి, జూన్ 7(విజయక్రాంతి): తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ, శాఖల పునర్విభజనపై ఊహాగానాలు జోరుగా సాగుతున్న వేళ.. అధికార కాంగ్రెస్ పార్టీలో అసంతృప్త జ్వా లలు ఎగిసిపడుతున్నాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు కేబినె ట్లో చోటు దక్కకపోవడంపై ఇబ్రహీంపట్నం సీనియర్ ఎమ్మె ల్యే మల్రెడ్డి రంగారెడ్డి మరోసారి తీవ్ర అసహనం వ్యక్తం చేశా రు. మంత్రి పదవి రేసులో తాను కూడా ఉన్నానని స్పష్టం చే స్తూనే.. అధిష్ఠానానికి ఊహించని రీతిలో అల్టిమేటం జారీ చేశారు. ఒకవేళ తనకు మంత్రి పదవి ఇవ్వడానికి కుల సమీకరణాలు అడ్డొస్తే.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి త్యాగానికై నా సిద్ధమని ప్రకటించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇప్పటి కే ఇదే మాట పలు సార్లు ప్రకటించడం గమనార్హం.
రాజగోపాల్రెడ్డితో పాటు నేనూ రేసులో ఉన్నా!
ఒక ప్రముఖ న్యూస్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మ ల్రెడ్డి రంగారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీనియర్ నేతగా నే ను మంత్రి పదవి ఆశించడంలో ఎలాంటి తప్పు లేదు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డితో పాటు తాను కూడా మంత్రి పదవి రేసులో ఉన్నాను. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు తప్పనిసరిగా మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పించాలి. ఒకవేళ సామాజిక, కుల సమీకరణాల పేరుతో నాకు అన్యాయం చేయాలని చూస్తే.. నా పదవికి రాజీనామా చేసి, నా స్థానంలో మరొకరిని గెలిపించుకోవడానికి కూడా నేను సిద్ధం‘ అని మల్రెడ్డి సంచలన ప్రకటన చేశారు. పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడిన వారిని పక్కనపెట్టి, ఇటీవల చేరిన వారికి ప్రాధాన్యత ఇవ్వడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
సీఎం సభలో ప్లకార్డుల కలకలం..
కోహెడ ఫ్రూట్ మార్కెట్ శంకుస్థాపన సభలో ముఖ్యమం త్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తుండగా.. ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి చెందిన మల్రెడ్డి అనుచరులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్లకార్డులు ప్రదర్శించారు. మల్రెడ్డి రంగారెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలంటూ వారు చేసిన హడావుడి చర్చనీయాంశమైంది. దీనిపై మల్రెడ్డి స్పందిస్తూ.. ‘కార్యకర్తలు తమ ఆవేదనను, అభిప్రాయాన్ని ప్లకార్డుల ద్వారా వ్యక్తపరిచారు, అందులో తప్పేమీ లేదు‘ అని సమర్థించుకున్నారు.
ఢిల్లీ వేదికగా జోరందుకున్న లాబీయింగ్..
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు గడుస్తున్నా.. కేబినెట్లో ఇంకా రెండు మంత్రి పదవులు ఖాళీగానే ఉన్నాయి. త్వరలోనే ఈ రెండు ఖాళీలను భర్తీ చేయడంతో పాటు, స్పీకర్ మార్పు, డిప్యూటీ సీఎం పదవుల కేటాయింపు, శాఖల పునర్విభజన వంటి కీలక మార్పులు ఉంటాయనే ప్రచారం గట్టిగా సాగుతోంది. దీంతో ఆశావహులంతా ఢిల్లీ బాట పట్టారు. ఇటీవల ఢిల్లీలో ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీని కలిసి కేబినెట్ బెర్త్ కోసం గట్టిగా ప్రయత్నాలు మొదలుపెట్టారు.గడ్డం ప్రసాద్ కుమార్ (స్పీకర్) ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వికారాబాద్ కు చెందిన ఈయన కూడా అధిష్ఠానం పెద్దలను కలిసి వచ్చారు.రామ్మోహన్ రెడ్డి (పరిగి ఎమ్మెల్యే) సైతం జిల్లా కోటాలో మంత్రి పదవి కోసం ఢిల్లీ వేదికగా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.
హైకమాండ్కు పెద్ద తలనొప్పిగా మారిన ‘విస్తరణ’..
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి పలువురు సీనియర్లు పోటీ పడుతుండటంతో ఎవరిని వరించి, ఎవరిని పక్కన పెడతారనేది ఉత్కంఠ రేపుతోంది. ఒకవైపు రాజగోపాల్ రెడ్డి లాంటి నేతలు హైకమాండ్ ఇచ్చిన పాత హామీలను గుర్తు చేస్తుంటే.. మరోవైపు మల్రెడ్డి రంగారెడ్డి ఏకంగా ‘రాజీనామా అస్త్రం‘ ప్రయోగించడం కాంగ్రెస్ అధిష్ఠానానికి పెద్ద తలనొప్పిగా మారింది. ఈ అసమ్మతి మంటలను సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పెద్దలు ఎలా చల్లారుస్తారో చూడాలి.






