20 August, 2026 | 9:35 AM

కమిషనర్, సానిటరీ ఇన్స్పెక్టర్ వేధింపులకు పాల్పడుతున్నారని కార్మికుల ధర్నా

20-08-2026 08:30 AM

విధులు బహిష్కరించి మునిసిపల్ కార్యాలయం ఎదుట ఆందోళన 

కార్మికులకు మద్దతు తెలిపిన సిఐటియు, సిపిఎం ప్రతినిధులు 

కామారెడ్డి, ఆగస్ట్ 20 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) కేంద్రంలో మున్సిపల్ కమిషనర్ పర్వతాలు, మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ రవీందర్ వేధింపులకు గురి చేస్తున్నారని మున్సిపల్ శానిటేషన్ కార్మికులు(Municipal sanitation workers) ఆందోళన చేపట్టారు. గురువారం విధులు బహిష్కరించి మున్సిపల్ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు. వ్యక్తిగత పనులకు వెళ్తే కూడా కూడా వేధిస్తున్నారని  ఆరోపించారు. సమాచారం ఇద్దామంటే ఫోన్ లిఫ్ట్ చేయకుండా వేదిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

మున్సిపల్ కమిషనర్ పర్వతాలు, సానిటరీ ఇన్స్పెక్టర్ రవీందర్ ల వేధింపులను మానుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికులను అనవసరంగా వేధింపులకు గురి చేస్తున్నారని సిఐటియు జిల్లా కార్యదర్శి బాల్ నర్సు, సిపిఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ లు తెలిపారు. పనిచేస్తున్న కార్మికులకు ఇబ్బందులకు గురి చేస్తున్న మున్సిపల్ కమిషనర్, శానిటరీ ఇన్స్పెక్టర్ లు పద్ధతి మార్చుకోవాలని కార్మికులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యాలయంలోకి మున్సిపల్ అధికారులు సిబ్బంది వెళ్లకుండా మున్సిపల్ ప్రధాన ద్వారం వద్ద కార్మికులు బైఠాయించి ఆందోళన కొనసాగిస్తున్నారు.