20 August, 2026 | 9:30 AM

సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురు దుర్మరణం

20-08-2026 08:23 AM

వేగం అదుపుతప్పి బావిలో పడిన కారు

మృతులు ఒకే కుటుంబానికి చెందినవారు

సిద్దిపేట క్రైం, ఆగస్టు 20 (విజయక్రాంతి) : సిద్దిపేట జిల్లా(Siddipet district) దుబ్బాక మండలం అప్పన్నపల్లి గ్రామ శివారులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. మృతులు ఒకే కుటుంబానికి చెందినవారు. బలవంతపూర్ గ్రామానికి చెందిన ధన్ల రాజు (35), అతని భార్య భాగ్య( 22), కుమారుడు నియాన్స్(5), కూతురు శాన్విక(3) కారులో ప్రయాణిస్తుండగా, అప్పన్నపల్లి గ్రామ శివారు వద్ద  వేగం అదుపుతప్పి కారు బావిలో పడింది. దాంతో కారులో ప్రయాణిస్తున్న కుటుంబ సభ్యులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న దుబ్బాక సీఐ, ఎస్‌ఐ, పోలీసు సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని, క్రేన్ సహాయంతో మృతదేహాలను బావిలో నుంచి వెలికితీయించారు. మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు.