బెల్లంపల్లి రోడ్డు ప్రమాదం.. కార్మికుడు మృతి
బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కన్నాల జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో కలకలం రేపింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డాడు. కన్నాల జాతీయ రహదారి మంచముఖి హనుమాన్ విగ్రహం ప్రధాన కూడలి వద్ద మంగళవారం రాత్రి ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో సురేష్(39) అనే సింగరేణి కార్మికుడు అక్కడిక్కడే మృతి చెందాడు. అతని వెంట ఉన్న చిరంజీవి అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. తిరుమల హిల్స్ లో ఓ ఫంక్షన్ కు వెళ్ళి బైక్ పై వస్తున్న సురేష్, చిరంజీవి నీ వెనుక నుంచి వచ్చిన వాహనం ఢీకొట్టింది. సురేష్ స్పాట్ డెత్ కాగా తీవ్రంగా గాయపడిన చిరంజీవి నీ అప్పటికప్పుడు కరీంనగర్ కు తరలించారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన సురేశ్ శాంతిఖని లో పనిచేస్తాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.






