19 August, 2026 | 11:03 PM

కార్మికుల హామీలను అమలు చేయాలి

19-08-2026 09:06 PM

మున్సిపల్ కమిషనర్ కు వినతి

యాదగిరిగుట్ట,(విజయక్రాంతి): రాష్ట్రంలో మున్సిపల్ రంగ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ మున్సిపల్ స్టాప్, కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట కమిషనర్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర మున్సిపల్ కమిషన్ సంఘం ప్రధాన కార్యదర్శి వనంపల్లి జైపాల్ రెడ్డి మాట్లాడుతూ... కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట కౌన్సిలర్ బి.శ్రీధర్ గౌడ్, బి.మధు, రాష్ట్ర మున్సిపల్ సంఘం కౌన్సిల్ సభ్యులు స్వామి, యాదగిరిగుట్ట మున్సిపల్ సంఘం ప్రధాన కార్యదర్శి జాంగిర్, ప్రధాన కార్యదర్శి పేరబోయిన స్వామి కౌన్సిలర్ బబ్బురి శ్రీధర్ గౌడ్ బూడిద మధు కౌన్సిలర్ కంప్యూటర్ ఆపరేటర్ నరేష్ శ్రీధర్ అత్తిపు కుమార్ ఐలమ్మ మొగులమ్మ లలిత తదితరులు పాల్గొన్నారు.