18 April, 2026 | 3:01 AM

కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

18-04-2026 12:00 AM
  1. మ్యానిఫెస్టోలోని అంశాలను అమలు చేయాలి
  2. రాష్ట్ర ఆర్టీసీ జేఏసీ వైస్ చైర్మన్ థామస్‌రెడ్డి
  3. డిపో ఎదుట ధర్నా చేపట్టిన సిబ్బంది

కామారెడ్డి, ఏప్రిల్ 17 (విజయక్రాంతి): ఆర్టీసీలో ఈనెల 22 నుంచి చేపట్టబోయే నిరవధిక సమ్మెలో భాగంగా సన్నాహక సభల్లో పాల్గొనడానికి శుక్రవారం సాయం త్రం కామారెడ్డి డిపో ముందు ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో సమ్మె కరపత్రాలను ఆవిష్కరించి గేటు  ముందు నిరసన ధర్నా నిర్వ హించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర జేఏసీ వైస్ చైర్మన్ థామస్‌రెడ్డి మాట్లాడుతూ రెండున్నర సంవత్సరాలు పూర్తవుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం, ప్రభుత్వ ఉద్యోగులతో సమానమైన జీతభత్యాలు, రెండు పీఆర్సీలు ,యూనియన్ల పునరుద్ధరణ తదితర అంశాలను మాత్రం అమలుపరచకుండా కాలయాపన చేస్తుందన్నారు. 18 వేల ఖాళీలను భర్త్తీ చేయకుండా ఉన్న సిబ్బందితోనే శ్రమదోపిడికి ఆర్టీసీ యాజమాన్యం పాల్పడుతున్నారని అన్నారు.

ఎలక్ట్రిక్ బస్సులతో డిపోలకు డిపోలు ప్రైవేటుపరం చేస్తూ పర్మనెంట్ ఉద్యోగాలు లేకుండా సంస్థను నిర్వీర్యం చేస్తున్నారని అన్నారు. పెండింగ్‌లో ఉన్న రెండు పీఆర్సీలను వెంటనే అమలు చేయాలని, 2017 పీఆర్సీ బకాయిలను వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీకి చెల్లించాల్సిన సుమారు 2700 కోట్ల రూపాయలు వెంటనే చెల్లించాలని విజ్ఞప్తి చేశారు.

వివిధ రకాల సబ్సిడీ పాసులకు చెల్లించాల్సినటువంటి డబ్బులను కూడా బడ్జెట్‌లో కేటాయించలేదని ఆ డబ్బులను వెంటనే జమ చేయాలని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను అమలు చేయా లని కోరారు.ఒకవేళ సమ్మె జరిగితే దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. 

కార్యక్రమంలో రాష్ట్ర జేఏసీ నాయకులు ఏ ఆర్ రెడ్డి, రీజియన్ నాయకులు వందేమాతరం శ్రీనివాస్, డి సంజీవ్, మాక్లూర్ శేఖర్, వీడీ దాస్, డిపో జేఏసీ నాయకులు రమేష్, రాజు, చారీ, , లింగం,కృషమూర్తి, షేకర్, సు ల్తానా, సునంద, బాల లక్ష్మి, లలిత, మం జుల,పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొన్నారు.