9 May, 2026 | 1:09 PM

Breaking News

నిర్బంధ రాజకీయాలకు ముగింపు పలకాలి   •   కాంగ్రెస్ నాయకత్వ చర్చల నడుమ — కేరళ సీఎంపై కొనసాగుతున్న ఉత్కంఠ   •   గోలేటి స్పోర్ట్స్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా దీకొండ సంజీవ్‌కుమార్   •   ఇంటి పనోళ్ల వివరాలు పోలీస్ స్టేషన్‌లో నమోదు చేయాలి   •   ఐపీఎస్ అధికారి భార్య హత్యకేసులో విచారణ వేగవంతం. రంగంలోకి 10 ప్రత్యేక పోలీసు బృందాలు   •   బెంగాల్‌ సీఎంగా సువేందు అధికారి ప్రమాణస్వీకారం   •   “Back to Question”: సంగారెడ్డి జైలు నుంచి మన్నె క్రిశాంక్ విడుదల   •   నాభి శిల, ముత్యాలమ్మ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   పెద్దమల్లారెడ్డిలో విద్యుత్ షాక్‌తో మహిళ మృతి   •   బొడ్డు కిరణ్‌కు ఆర్థిక సహాయం చేసిన కాంగ్రెస్ నాయకులు   •  

శ్రీరామ నవమి వేడుకల పనులు ప్రారంభం

09-03-2026 12:10 AM

సూర్యాపేట, మార్చి 8 (విజయక్రాంతి): ఈనెల 19 నుండి 28 వరకు బొడ్రాయి బజార్ లో గల శ్రీ వేదాంత భజన మందిరములో జరుగు శ్రీ సీతారామచంద్ర స్వామి నవరాత్రి ఉత్సవములు 74వ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం భక్తులు పసుపు కొట్టి శ్రీరామ నవమి వేడుకల పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్ష్యాది పాల్గొని పసుపు కొట్టి ఉత్సవాలు ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన వేదాంత భజన మందిరంలో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం అభినందనీయమన్నారు. అందులో భాగంగా పసుపు కొట్టే కార్యక్రమంలో పాల్గొనడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ శ్రీరామ నవమి వేడుకలను విజయవంతం చేయాలన్నారు.

అంతకుముందు దేవాలయ ప్రధాన అర్చకులు ధరూరీ సింగరాచార్యులు శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ వేదాంత భజన మందిరం అధ్యక్షులు రాచర్ల వెంకటేశ్వరరావు ప్రధాన కార్యదర్శి నకరికంటి రాజశేఖర్ కోశాధికారి సోమ అశోక్, మాజీ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఉప్పల లలిత ఆనంద్, సోమ సుమన్, ధరూరి రాఘవచార్యులు, గోదాదేవి, ప్రేమలత, హైమావతి, శోభారాణి, కక్కిరేణి పద్మ, గుండా సుధామాధురి, సుగుణమ్మ పాల్గొన్నారు.