21-02-2026 01:20:07 AM
ఆసియాకప్ రైజింగ్ స్టార్స్
బ్యాంకాక్, ఫిబ్రవరి 20: మహిళల ఆసియాకప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో భారత ఏ జట్టు టైటిల్ కు అడుగుదూరంలో నిలిచింది. సెమీఫైనల్లో భారత్ ఏ వుమెన్స్ టీమ్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక ఆరంభంలో దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించింది. ఓపెనర్ సంజన 31, శసినీ(22) పరుగులతో రాణించారు. నిజానికి లంక భారీస్కోరు చేస్తుంద నుకుంటే భారత కెప్టెన్ రాధా యాదవ్ దెబ్బ కు లంక బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టా రు. దీంతో శ్రీలంక 19.4 ఓవర్లలో 118 పరుగులకు ఆలౌటైంది.
భారత బౌలర్లలో కెప్టెన్ రాధా యాదవ్ నాలుగు వికెట్లు పడగొట్టింది. ప్రేమ రావత్, తనుజా కన్వర్ లు చెరో రెండు వికెట్లు తీశారు. సైమా ఠాకూర్, మిన్ను మణి లు తలా ఓ వికెట్ పడగొట్టా రు. తర్వాత బృందా దినేష్ 20 బంతుల్లో 8 ఫోర్లతో 42 , రాధా యాదవ్ కెప్టెన్ రాధా యాదవ్ (31 నాటౌట్; 18 బంతుల్లో 7 ఫోర్లు), అనుష్క శర్మ(27; 18 బంతుల్లో 5 ఫోర్లు) రాణించడంతో 119 పరుగుల లక్ష్యా న్ని భారత్-ఏ జట్టు 13.3 ఓవర్లలో ఐదు వికె ట్లు కోల్పోయి ఛేదించింది. ఫైనల్లో భారత మహిళలు బంగ్లాదేశ్‌తో తలపడతారు.