20 June, 2026 | 1:20 AM

ఉచిత జ్యూట్ బ్యాగ్ తయారీ శిక్షణ శిబిరాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలి

20-06-2026 12:02 AM
  1. బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంటు జాయింట్ కన్వీనర్ వినయ్ కుమార్
  2. ఉచిత జ్యూట్ బ్యాగ్ తయారీ శిక్షణ శిబిరం ఏర్పాటు

ముషీరాబాద్, జూన్ 19 (విజయక్రాంతి): ఉచిత జ్యూట్ బ్యాగ్ తయారీ శిక్షణ శిబిరాలను మహిళలు సద్వినియోగం  చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంటు జాయింట్ కన్వీనర్ ఏ. వినయ్ కుమార్ అన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్ ప్యారడైజ్, ని వి చారిటబుల్ ట్రస్ట్  సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఉచిత జ్యూట్ బ్యాగ్ తయారీ శిక్షణ శిబిరాన్ని గాంధీనగర్ డివిజన్ చిక్కడపల్లి లోని మహిళా భవన్ లో శుక్రవారం  సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ హాజరై ప్రారంభించారు.

లయన్స్ క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్ ప్యారడైజ్ తో కలిసి తమ ‘ని వి‘ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా మహిళలకు స్వయం ఉపాధి రూపకల్పనకు తోడ్పాటును కల్పిస్తూ వారికి ఉచితంగా టైలరింగ్, మగ్గం, బ్యూటిషియన్ కోర్సుల్లో శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి, శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికేట్ లను అందచేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఉచిత శిక్షణ శిబిరాల ద్వారా అనేక మంది మహిళలు స్వయం ఉపాధి ఏర్పరచుకొని వారి కుటుంబాలకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించుకుంటున్నారని,

అందుకు మహిళా సాధికారత తో సేవలందించేందుకు ఎల్లపుడూ ముందు వుండే లయన్స్ క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్ ప్యారడైజ్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. నేటి నుండి ప్రారంభమయ్యే ఉచిత జూట్ బ్యాగ్ తయారీ శిక్షణ శిబిరాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు చంద్రమోహన్, ఐపిపి సెరిపల్లి గణేష్, ప్రవీణ్, విజయెంధర్, కాసం శ్రీనివాస్, నాగరాజు, హేమంత్, పవన్, జూట్ బ్యాగ్ ప్రాజెక్టు చైర్మన్ పవిత్ర, బీజేపీ నేతలు, దామోదర్, పరిమల్, ఆనంద్ రావు పాల్గొన్నారు.