27 May, 2026 | 4:29 AM

మహిళలు ఆర్థికంగా ఎదగాలి

27-05-2026 12:25 AM

ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి

కల్వకుర్తి మే 26: మహిళలను ఆర్థికంగా ఎదిగేలా రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా  తోడ్పాటు అందిస్తుందని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని ఓ ఫంక్షణ్ హోలులో రాష్ట్ర ప్రభుత్వం అందించిన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రత్నమాలతో కలిసి పాల్గొన్నారు. 

మహిళలు ఆర్థికంగా ఎదగాలనే ఆలోచనతో స్వయం సహాయక సంఘాలకు గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం రుణాలను అందించిందన్నారు. మహిళా సంఘాల సభ్యులకు పెట్రోల్ బంకులు, ఆర్టీసీలో అద్దె బస్సుల ద్వారా ఉపాధి అవకాశం, ఆర్టీసీలో ఉచిత ప్రయాణం లాంటి కార్యక్రమాలను ఎన్నో చేపట్టిందని గుర్తుచేశారు. మహిళలు సైతం ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా సంతోషంగా ఉన్నారన్నారు. మహిళలు ఇంకా ఆర్థికంగా ఎదగాలనే లక్ష్యంతో ప్రజాప్రభుత్వం ముందుకు సాగుతుందని అన్నారు.

అనంతరం మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పలు మండలాలలకు చెందిన లబ్దిదారు లకు కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులను కాంగ్రెస్ నాయకులతో కలిసి పంపిణీ చేశారు.  కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ షానవాజ్ ఖాన్, మున్సిపల్ కౌన్సిలర్లు, కల్వకుర్తి ఆర్టీఓ జనార్థన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ మహామూద్ షేక్,  పట్టణ ప్రజలు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.