16 June, 2026 | 7:07 PM

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

16-06-2026 06:33 PM

చిట్యాల,(విజయక్రాంతి): నార్కట్‌పల్లి మండల పరిధిలోని జిందాల్ ఫ్యాక్టరీ సమీపంలో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. నార్కట్ పల్లి  పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం నార్కట్ పల్లి మండలం ఏపీ లింగోటం గ్రామానికి చెందిన పల్లగొర్ల లింగయ్య (50) తన వ్యక్తిగత పనుల నిమిత్తం నార్కట్‌పల్లి గ్రామానికి వెళ్లి, అనంతరం తన గ్రామానికి టీజి 05 బిఏ 2063 నంబరు గల ఎలక్ట్రిక్ స్కూటర్‌పై తిరిగి వెళ్తుండగా, హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న టీజీ 05 8855 నంబరు గల ఎర్టిగా కారు వెనుక నుంచి ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో లింగయ్య స్కూటర్‌తో పాటు రోడ్డుపై పడిపోయి తలకు తీవ్ర గాయాలు కావడంతో పాటు ఎడమ చేతికి బలమైన గాయాలు తగిలాయి. తీవ్ర రక్తస్రావం కారణంగా ఆయన ఘటనాస్థలంలోనే మృతి చెందారు. మృతుడి భార్య పల్లగొర్ల నాగమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్కట్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ దోమలపల్లి రాజు మునుగోడు గ్రామం గా గుర్తించారు. ఈ ఘటనపై నార్కట్‌పల్లి ఎస్సై పి. విష్ణుమూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.