16 July, 2026 | 12:35 AM

చోరీలకు పాల్పడిన మహిళ అరెస్ట్

16-07-2026 12:00 AM

27 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం

సికింద్రాబాద్, జూలై 15 (విజయ క్రాంతి): రైల్వే ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుని వరుస చోరీ లకు పాల్పడుతున్న  మహిళా నేరస్థురాలిని సికింద్రాబాద్ రైల్వే పోలీసులు (జీఆర్పీ), రైల్వే రక్షక దళం (ఆర్పీఎఫ్) సంయుక్తం గా అరెస్టు చేశారు. ఆమె వద్ద నుంచి 27 గ్రాముల బంగారు ఆభరణా లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వీటి విలువ సుమారు రూ.3.24 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు.అరెస్టైన మహిళ మేరీ షీలా (64), మౌలాలి ప్రాంతానికి చెంది నది.

గతంలో కూడా సికింద్రా బాద్ రైల్వే పోలీస్ స్టేషన్లో నమోదైన చోరీ కేసులో అరెస్టై జైలుకు వెళ్లినట్లు పోలీసులు వెల్లడించారు. జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా ఆమె తన నేరపూరిత కార్యకలా పాలను కొనసాగించినట్లు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. 2025 నవంబర్ 12న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 7వ ప్లాట్ఫారంపై ఓ మహిళాప్రయాణికురాలి నుంచి బంగారు ఆభరణాలు, నగదు చోరీ చేసింది. అనంతరం 2026 జూలై 1న మరో మహిళా ప్రయాణికు రాలిని లక్ష్యంగా చేసుకుని బంగారం, నగదు అపహరిం చింది.

నగదును వ్యక్తిగత అవసరాలకు ఖర్చు చేయగా, కొంత బంగారాన్ని విక్రయించి మిగిలిన ఆభరణాలను తన వద్ద దాచుకున్నట్లు విచారణలో ఒప్పుకుందని పోలీసులు తెలిపారు. బుధవారం మరోసారి చోరీలకు పాల్పడేందుకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు వచ్చిన సమయంలో అనుమా నాస్పదంగా సంచరిస్తుండగా జీఆర్పీ, ఆర్పీఎఫ్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు.

విచారణలో రెండు చోరీ కేసులను అంగీకరించడంతో ఆమె వద్ద ఉన్న 27 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. రైల్వే పోలీస్ సూపరింటెండెంట్ వై. సాయి శేఖర్ పర్యవేక్షణలో ఎస్హెచ్వో బి. సాయీశ్వర్ గౌడ్, జీఆర్పీ, ఆర్పీఎఫ్ బృందాలు ఈ కేసును ఛేదించాయి. నిందితురాలిని పట్టు కున్న పోలీసు సిబ్బందిని రైల్వే, రోడ్డు భద్రత ఐజీపీ కె. రమేష్ నాయుడు అభినందిస్తూ, వారికి తగిన బహుమతులు అంద జేయనున్నట్లు తెలిపారు.