రాయలసీమ నేపథ్యం కథతో..
విక్టరీ వెంకటేశ్, నందమూరి కళ్యాణ్‌రామ్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు అనిల్ రావిపూడి ఓ సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ‘వెంకీ ‘ఎన్‌ఆర్‌కే అనే వర్కింగ్ టైటిల్స్‌తో ప్రచారంలో ఉన్న ఈ సినిమా షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు.
సురేశ్ ప్రొడక్షన్స్, శ్రీమతి అర్చన, జీ స్టూడియోస్ సంస్థలు సమర్పిస్తున్న ఈ సినిమాలో వెంకటేశ్, కళ్యాణ్‌రామ్ సరసన కీర్తి సురేశ్, కృతి శెట్టి కథానాయికలుగా నటిస్తున్నారు. ఇటీవలే పూజా కార్యక్రమంతో ఈ ప్రాజెక్ట్ లాంఛనంగా ప్రారంభమైన విషయం విదితమే. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సోమవారం నుంచి హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని చిత్రబృందం తాజాగా ఒక ఫన్ వీడియో ద్వారా వెల్లడించారు. సినీ పరిశ్రమలో ప్రమోషన్ల విషయంలో తనదైన శైలిని అనుసరిస్తున్న అనిల్ రావిపూడి ఈసారి కూడా తన క్రియేటివిటీని చాటుకున్నారు.
తాజా వీడియోలో డైరెక్టర్ అనిల్ తన టీమ్ తో చెబుతున్న మాటలు వినోదం పంచుతున్నాయి. ప్రధాన తారాగణమంతా ఈ వీడి యోలో కనిపించడం ఆకట్టుకుంది. ఇక ఈ వీడియోలో మరో ఆసక్తికర విషయం కూడా వెల్లడైంది. ఈ సినిమా కథ రాయలసీమ నే పథ్యంలో సాగుతుందని, పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రంగా ప్రేక్షకులను అలరిస్తుందని మేకర్స్ స్పష్టం చేశారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీతం అందిస్తుండగా, సమీర్‌రెడ్డి సినిమాటోగ్రఫీని, తమ్మిరాజు ఎడిటింగ్‌ను, ఏఎస్ ప్రకాశ్ ఆర్ట్ డైరెక్షన్ నిర్వహిస్తున్నారు. ఈ చిత్రం 2027 సంక్రాంతి సం దర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.






