ప్రాంతానికో న్యాయం ఉంటుందా?
- ఖమ్మం మాదిరిగానే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి
మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
మహబూబ్ నగర్ టౌన్, మార్చి 12 : రాష్ట్రవ్యాప్తంగా అందరికీ సమన్యాయం చేసేలా ప్ర భుత్వం అడుగులు వేయవలసిన అవసరం ఎంతైనా ఉందని ప్రాంతానికి ఒక న్యాయం ఎక్కడై నా ఉంటుందా అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. గురువారం మహబూబ్ నగర్ లోని క్రిస్టియన్ పల్లి 523 సర్వే నెంబర్ లో కూలగొట్టిన ఇండ్ల బాధితులకు సైతం కూలగొట్టిన ప్రాంతంలో ఇండ్లు కట్టుకునేందుకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలనీ బాధితులు గురువారం ఆందోళన నిర్వహించారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బాధితులకు మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ అంధులు..వికలాంగులు ఉండే కాలనీ లో అర్ధరాత్రి జేసీబీ లతో వచ్చి ఇండ్లలో ఉన్న వారిని బయటికి పంపించి కూలగొట్టారన్నారు. రాత్రి పూట వచ్చి ఎక్కడ కూలగొడ్తారో అని ఉన్న వాళ్ళు నిద్రపోవడానికి కూడా భయపడుతున్నార ని, కూలికి పోతే ఇండ్లలో లేరని వచ్చి కూలగొడ్తారో అనే భయంతో కొందరు కూలికి పోవడం లేదన్నారు. చూపు లేని మహిళా ఆస్పత్రిలో కాన్పుకోసం వెళ్లిన వారి ఇండ్లను కూడా కూలగొట్టారని,ఆమె భర్తకు కూడా కాళ్లు లేవన్నారు. ఇక్కడ చెరువు లేదని,ప్రభుత్వ భూమి ప్రత్యేక అ వసరాలు కలిగిన వారికీ ఇచ్చారన్నారు.
ఇవేమీ పట్టించుకోకుండా అధికారులు కూలగొట్టారన్నా రు. కొందరు వచ్చి ఇప్పటికి బెదిరింపులకు దిగుతున్నారని అంటే నేను పరామర్శించడానికి వ చ్చానన్నారు. అందరికీ న్యాయం చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, ముడా మాజీ చైర్మన్ గంజి వెంకన్న, కార్పొరేటర్లు హైందవి, మధుమోహన్, రమేష్ నా యక్, శరత్ రెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షులు శివరాజ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్సీ ఆంజనేయు లు, సీనియర్ నాయకులు క్రాంతి, పాల సతీష్ తదితరులు పాల్గొన్నారు.




