నోటీసులిచ్చి నోట్ల కట్టలు నొక్కేసి..!?
- అడ్డగోలుగా అక్రమ కట్టడాలు
- స్వంత ప్యాకెట్ మనీగా మున్సిపల్ ఆధాయ వనరులు
- అభివృద్ధి, పారిశుధ్యంపై పట్టింపు లేమి
- బలాదూర్‌గా తిరిగేస్తున్న మున్సిపాలిటీ శాఖ
- పాలగవర్గం మారినా ఫలితం సున్నా
నాగర్ కర్నూల్ మే 19 ( విజయక్రాంతి )నాగర్ కర్నూల్ మున్సిపాలిటీలో అవినీతి, అక్రమాలతో పాటు అలసత్వం రాజ్యమేలుతోంది. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ స్థలాలు నాలా, ప్రజా రవాణాకు ఆటంకం కలిగేలా రహదారులు ఆక్రమణలు జరుగుతున్నా తమకేమీ పట్టనట్లు మున్సిపల్ శాఖ అధికారుల తీరు తీవ్ర చర్చనీయాంశంగా మారుతుంది. నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలో సమీప విలీన గ్రామాలు విలువైన జోన్ ప్రదేశాల్లో రెసిడెన్షియల్ కొరకు ఒక్క రూపాయితో అనుమతులు పొంది ఆకాశమే హద్దుగా భారీ ఎత్తున అక్రమ నిర్మాణా లు సాగిస్తున్నారు.
కమర్షియల్ కొరకు వినియోగిస్తున్నా కళ్ళప్పగించి చూస్తున్నారు తప్ప మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వ్యక్తం అవుతున్నా యి. అధికార పార్టీకి చెందిన పాలకవర్గమే కొలువుదీరినప్పటికీ అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోకపోవడం వెనుక రాజకీయ స్వలాభం దాగి ఉందని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఒక్కో అక్రమ నిర్మాణానికి నోటీసులు ఇస్తూ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ సిబ్బందితో భారీగా ముడుపులు అందుకుంటున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రతినెలా సమయానికి జీతం తీసుకునే అధికారులు కూడా కార్యాలయానికి ఇలా వచ్చి సేద తీరుతూ అవినీతి సొమ్ము లెక్కబెడుతూ తాపీగా సాయంత్రానికి తిరిగి వెళ్ళిపోతున్నారని ఎలాంటి అభివృద్ధి, పారిశుధ్యం కార్య క్రమాలపై శ్రద్ధ చూపడం లేదని బాహాటం గా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరుగుతున్నాయని స్థానికుల ద్వారా ఫిర్యాదులు అం దినా కేవలం నోటీసులు ఇచ్చి చేతులు దులిపేసుకుంటున్నారని ఎన్ఫోర్స్మెంట్ టౌన్ ప్లా నింగ్ విభాగం పనితీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
చెరువులు కుంటలు వాటిలో ఆక్రమణలను తొలగించేందుకు మీ నమేషాలు లెక్కిస్తుందని వచ్చేది వర్షాకాలం అయినప్పటికీ ఆక్రమణలు తొలగించడంలో శ్రద్ధ చూపకపోవడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నిస్తున్నారు. నోటీసులతోనే సరిపెడుతున్నారు. ఆకాశమే హద్దుగా జి ప్లస్ ఫోర్, జి ప్లస్ ఫైవ్ స్థాయిలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు కేవలం నోటీసులతోనే సరిపెట్టడం వెనక బలమైన కారణం దాగి ఉందని భారీ మొత్తంలో ముడుపులు చేతులు మారాయని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
నాగర్ కర్నూల్ కేసరి సముద్రం ఎఫ్టిఎల్ బఫర్ జోన్ పరిధిలో ఆక్రమణలు తొలగించాలని స్థానికులు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టును ఆశ్రయించగా 46 ప్రదేశాల్లో అక్ర మ నిర్మాణాలు ఉన్నట్లు గుర్తించి వాటిని తొ లగిస్తున్నట్లు కోర్టుకు జవాబిచ్చారు అయినా నేటికీ వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోగా బయో ఫెన్సింగ్ ఏర్పాట్లు అడుగు ముందుకు వేయడం లేదని దీని వెనక రాజకీయ స్వలాభం దాగి ఉందని చర్చ జరు గుతుంది.
పట్టణంలోని ప్రధాన రహదారు లు ఆయా వార్డులోని విలువైన జోన్ ప్రాం తాల్లో అక్రమ కట్టడాలు సెట్ బ్యాక్ నిబంధన ఉల్లంఘిస్తున్న సంబంధిత విభాగం పట్టించుకోలేదు. స్థానికుల నుండి ఫిర్యాదు లు అందిన కేవలం నోటీసులు ఇచ్చి చేతులు దులిపేస్తున్నారు. 30 అక్రమ కట్టడాలు ఉన్నట్లు గుర్తించి నోటీసులు కూడా ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వెనక అవినీతికి పాల్పడినట్లు జోరుగా చర్చ జరుగుతోంది. మున్సిపల్ కార్యాలయానికి కూతవేటు దూ రంలో ఉన్న భారీ అంతస్తు కూడా నిబంధనలకు విరుద్ధంగా ఉన్నప్పటికీ పట్టించు కోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి. నూతనంగా ఏర్పడిన పాలకవర్గం కూడా తమకే మీ పట్టనట్లు వ్యవహరించడం వెనక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.






