3 April, 2026 | 4:08 AM

చెన్నై బోణీ కొట్టేనా?

03-04-2026 12:43 AM
  1. ఇవాళ పంజాబ్ కింగ్స్‌తో ఢీ
  2. తొలి మ్యాచ్‌లో ఓడిన సీఎస్కే
  3. సంజూ శాంసన్‌పై భారీ అంచనాలు
  4. బ్యాటర్లు రాణిస్తేనే విజయావకాశాలు

చెన్నై , ఏప్రిల్ 2 : ఐపీఎల్ 19వ సీజన్ ను ఓటమితో ప్రారంభించిన చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పుడు సొంతగడ్డపై  మ్యాచ్ కు రెడీ అయింది. శుక్రవారం చెపాక్ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్ ను ఢీకొంటుంది. గత సీజన్ వైఫల్యాన్ని కొనసాగిస్తూ తొలి మ్యాచ్ లో చెన్నై చిత్తుగా ఓడిపోయింది. అంచనాలు పెట్టుకున్న ఏ ఒక్కరూ రాణించలేదు. ధోనీ కండరాల నొప్పితో కొన్ని మ్యాచ్ లకు దూరమవడం కూడా చెన్నైకి మైనస్ గా మారింది. ట్రేడింగ్‌లో సీఎస్కేకు వచ్చిన సంజూ శాంస న్ తొలి మ్యాచ్ లో నిరాశపరిచాడు.

సంజూ భారీ ఇన్నింగ్స్ ఆడాలని చెన్నై ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కూడా ఫామ్ అందుకోవాల్సి ఉంది. వీరిద్దరూ మెరుపు ఆరంభాన్నిస్తే భారీస్కోరుపై ఆశలు పెట్టుకోవచ్చు. తర్వాతి బ్యాటింగ్ ఆర్డ ర్‌లో ఆయుష్ మాత్రే, బ్రెవిస్ పై భారీ అంచనాలున్నాయి. గత మ్యాచ్‌లో గాయం కార ణంగా ఆడని మాత్రే జట్టులోకి తిరిగి రానుండడం చెన్నై బలాన్ని పెంచేదే. అలాగే ఫినిషర్ శివమ్ దూబే చెలరేగితే చెన్నై సూపర్ కింగ్స్ భారీస్కోరు చేయడం ఖాయం.

ఇటీవల టీ20 ప్రపంచకప్‌లో ధనాధన్ ఇన్నింగ్స్‌లు ఆడిన దూబేపై సీఎస్కే ఆశలు పెట్టుకుంది. అలాగే కార్తీక్ వర్మ, ప్రశాంత్ వీర్ కూడా బ్యాట్‌తో మెరుపులు మెరిపించేవారే. బౌ లింగ్‌లో మ్యాట్ హెన్రీ, ఖలీల్ అహ్మద్ కొత్త బంతితో చెలరేగేందుకు ఎదురుచూస్తున్నా రు. అలాగే జేమీ ఓవర్టన్ కూడా మిడిల్ ఓవర్లలో కీలకం కానున్నాడు. అటు స్పిన్ విభా గంలో నూర్ అహ్మద్ పైనే సీఎస్కే భారం మోపింది. గత మ్యాచ్ లో ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన సర్ఫరాజ్ ఖాన్ కూడా విఫలమయ్యాడు.

దీంతో బ్యాటర్లు రాణించడంపైనే చెన్నై విజయావకాశాలు ఆధారపడి ఉన్నా యి. మరోవైపు సీజన్ ను విజయంతో ఆరంభించిన పంజాబ్ కింగ్స్ ఫుల్ జోష్‌లో ఉం ది. గత మ్యాచ్‌లో ఓపెనర్లు ప్రభ్ సిమ్రన్ సింగ్, ప్రియాన్ష్ ఆర్య సరైన ఆరంభాన్నివ్వలేకపోయారు.

కూపర్ కన్నోలీ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడడంతో విజయాన్ని అందుకున్న పంజాబ్ కింగ్స్ కు శ్రేయాస్ అయ్యర్, వధేరా, స్టోయినిస్, శశాంక్ సింగ్ లాంటి హిట్టర్ల బలముంది. అటు పేస్ బౌలింగ్ లో బార్ట్ లెట్, మార్కో యెన్సన్, అర్షదీప్ సింగ్ ఉన్నారు. వీరిలో అర్షదీప్ గాడిన పడాల్సి ఉంది. 

గత రికార్డులు

ఐపీఎల్ చరిత్రలో ఇరు జట్లు ఇప్పటి వర కూ 32 సార్లు తలపడితే పంజాబ్ కింగ్స్ 16, సిఎస్‌కె 16 మ్యాచ్‌లు గెలిచాయి.

పిచ్ రిపోర్ట్

సాధారణంగా చెపాక్ పిచ్ సిన్నర్లకు అనుకూలిస్తుంది. ఐపీఎల్ కావడంతో బ్యాటర్లకు కూడా సపోర్ట్ దక్కుతుంది. దీంతో భారీస్కో ర్లు నమోదవ్వొచ్చు.

తుది జట్లు అంచనా

చెన్నై సూపర్ కింగ్స్ : సంజూ శాంసన్(కీపర్), రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), ఆయుశ్ మాత్రే, మాథ్యూ షార్ట్, శివమ్ దూబే, కార్తీక్ శర్మ, జేమీ ఓవర్టన్, నూర్ అహ్మద్, మ్యాట్ హెన్రీ, అన్షుల్ కాంబోజ్, ఖలీల్ అహ్మద్

పంజాబ్ కింగ్స్: ప్రభ్‌సిమ్రన్(కీపర్), కూపర్, శ్రేయాస్ అయ్యర్, నేహల్ వధేరా, శశాంక్, స్టోయినిస్, యెన్స న్, బార్ట్‌లెట్, విజయ్‌కుమార్ వైశాఖ్, అర్షదీప్, చాహల్