31 May, 2026 | 11:25 PM

Breaking News

సోనాల మండలంలో భారీ వర్షం.. జొన్న రైతుల్లో ఆందోళన   •   సీఎం ఓవర్సీస్ పథకానికి దరఖాస్తు చేసుకోండి   •   రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ తెలంగాణ జేఏసితో ప్రభుత్వం చర్చలు జరపాలి   •   విద్యుత్ కాంట్రాక్టర్ ఒత్తిల్లు... గాల్లో దీపంలా లేబర్ బ్రతుకులు   •   టీఎన్జీవోల ఆధ్వర్యంలో ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవం   •   విద్యుత్ ప్రమాద బీమా చెక్కును అందించిన తుమ్మల యుగంధర్   •   నేటితో ముగియనున్న కొండపైన వర్తక సంఘం లీజు గడువు   •   జనసంద్రంగా యాదగిరి క్షేత్రం   •   మహమ్మద్ జావీద్ శ్రద్ధాంజలి కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు   •   ఈటలకు వ్యతిరేకంగా ప్లెక్సీలు.. స్పందించిన రాంచందర్   •  

ధోనీ ప్రాక్టీస్ షురూ

03-04-2026 12:41 AM

చెన్నై, ఏప్రిల్ 2 : చెన్నై సూపర్‌కింగ్స్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్... మాజీ కెప్టెన్ మ హేంద్రసింగ్ ధోనీ అనుకున్న సమయానికంటే ముందుగానే మైదానంలోకి రానున్నాడు. కండరాల నొప్పితో ప్రస్తుతం ఆటకు దూరమైన ధోనీ జట్టుతో పాటే ఉన్నాడు. తాజాగా చెపాక్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో మ్యా చ్‌కు ముందు ధోనీ సహచర ఆటగాళ్ళతో కలిసి ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. మోకాలికి ఉన్న కట్టు కూడా తీసేసాడు.

దీంతో దాదా పు ఆరు మ్యాచ్‌ల వరకూ అందుబాటులో ఉండడనుకున్న ధోనీ ఇంకా ముందే బరిలోకి దిగే అవకాశముందని సమాచారం. ఈ సీజన్ తొలి మ్యాచ్‌కు ముందు ధోనీ అనూహ్యంగా కండరాల నొప్పితో బాధపడడంతో 2-3 వారాలు దూరమవుతాడని సీఎస్కే ఫ్రాంచైజీ ప్రకటించింది. గత వారం మోకాలికి బెల్ట్ వేసుకుని కూడా కనిపించడంతో అభిమానులు ఆందోళన చెందారు. ఈ సీజన్ ఆరంభంలో సీఎస్కే ట్రైనింగ్ క్యాంపులోనూ ధోనీ కాస్త అసౌకర్యంగా కనిపిం చాడు.