ఇకనైనా మగువ మాట చెల్లుతుందా?
డా.కావలి చెన్నయ్య :
మన స్వతంత్ర భారత పార్లమెం టు ఉభయ సభల చరిత్రలో ఇప్పటివరకు 7500 మంది ఎంపీలుగా ఎన్నుకోబడితే అందులో కేవలం మహిళలు 600 మాత్రమే. ప్రస్తుత 18వ లోక్‌సభలో 543 ఎంపీలకుగాను 74 మంది మాత్రమే మహిళలు. అంటే 13.62%. గత 17వ లోక్‌సభలో 78 మంది మాత్రమే మహిళలు. అంటే 14.39%. అదేవిధంగా ప్రస్తుత రాజ్యసభలో 250 మంది ఎంపీలకుగాను 39 మంది మహిళలు.
అంటే 16% వరకు. 1వ లోక్‌సభలో మహిళలు కేవలం 4.50% మాత్రమే. భారత రాష్ట్రపతిగా ప్రతిభ దేవిసింగ్‌పాటిల్, ప్రధానిగా ఇందిరాగాంధీ పని చేసినప్పటికీ మహిళల భాగస్వామ్యం ఏ రం గంలోనూ ఏనాడు 50% దాటలేదు. సం ఖ్యాపరంగా పురుషులతో సమానంగా ఉన్నప్పటికీ. గమనించాల్సిన విషయం చట్ట సభ లలో మహిళా ఎంపీలు బంగ్లాదేశ్ 21%, బ్రిటన్ 35%, పేద దేశమైన రువాండాలో 64%లతో మనకంటే ఎంతో ముందున్నారు.
చట్టసభలలో మహిళా ప్రాతినిథ్య ప్రపం చ సగటు 26.5%, మధ్య-దక్షిణాసియా సగ టు 19%గా ఉండగా మన సగటు చాలా తక్కువ. దేశంలో 18 రాష్ట్రాల శాసనసభల్లో మహిళల ప్రాతినిథ్యం కేవలం ఏక సంఖ్య, ఏడు రాష్ట్రాల్లో మాత్రం రెండు అంకెలకే పరిమితం. ఛత్తీస్‌గఢ్‌లో 14.44%, పశ్చిమబెం గాల్ 13.7%, జార్ఖండ్ 12.5%.
కేంద్ర ఎన్నికల సంఘం డాటా ప్రకారం 1952--2024 వరకు 18 సార్లు జరిగిన లోక్‌సభ ఎన్నికలలో మహిళల ప్రాతినిథ్యం పరిశీ లిస్తే 1952లో మెత్తం సభ్యులు -489 (22 మంది మహిళలు 4.50%), 1957లో -494 (27 మంది మహిళలు 5.47%), 1962లో -494 (34 మంది మహిళలు 6.88%), 1967-లో 523 (31 మంది మహిళలు 5.93 %), 1971లో -521(22 మంది మహిళలు 4.22%), 1977లో -544 (19 పంది మహిళలు 3.49%), 1980-లో 544 (28 మంది మహిళలు 5.15%), 1984లో- 544 (44 మంది మహిళలు 8.09%) 1989లో -529 (28 మంది మహిళలు 5.29%), 1991లో -509 (36 మంది మహిళలు 7.07%), 1996లో- 541 (40 మంది మహిళలు 7.37%), 1998-లో 545 (44 మంది మహిళలు 8.10%), 1999లో -543 (44 మంది మహిళలు 8.10%), 2004లో -543 (47 మంది మహిళలు 8.66%), 2009లో- 543 (59 మంది మహిళలు 10.87%),2014లో -543 (62 మంది మహిళలు 11.42%), 2019లో- 542 (78 మంది మహిళలు 14.39%), 2024లో -543 (74 మంది మహిళలు 13.6%). చట్టసభలలో మహిళల కు రిజర్వేషన్లు 64 దేశాల్లో అమలు అవుతున్నాయి. రువాండా 2003లో చట్టసభలలో మహిళలకు 30% కోటాను ఇచ్చి 10 సంవత్సరాలలో అంటే.. ప్రస్తుత పార్లమెంటులో 64% మంది మహిళా ప్రతినిధులు ఉండ డం చాలా సంతోషం.
ప్రపంచంలోని 10 దేశాల పార్లమెంటుల లో మహిళల ప్రాతినిధ్యాన్ని పరిశీలించినట్లయితే స్వీడన్ -46%, నార్వే-46%, సౌత్ ఆఫ్రి కాల- 45%, ఆస్ట్రేలియా- 38%, ఫ్రాన్స్ -38%, జర్మనీ -35%, ఇంగ్లాండ్ హౌస్ ఆఫ్ కామన్స్- 35%, కెనడా- 31%, బంగ్లాదేశ్ 21% ఈ దేశంలో కూడా రాజకీయ పార్టీల్లో మహిళా రిజర్వేషన్లు ఉన్నాయి. కానీ పార్లమెంట్‌లో లేవు. అమెరికా హౌస్ ఆఫ్ రిప్ర జెంటిట్యూస్ -29%, సెనెట్‌లో 25% ఇక్కడ చట్టసభలలో రాజకీయ పార్టీలలో కూడా మహిళలకు రిజర్వేషన్లు లేవు.
బ్రెజిల్- 18% రాజకీయ పార్టీలలో రిజర్వేషన్లు లేవు. కానీ పార్లమెంట్‌లో ఉన్నాయి. జపాన్- 10%, ఇక్కడ రాజకీయ పార్టీలలో, పార్లమెంట్లో రిజర్వేషన్లు లేవు. మహిళల ప్రాతినిథ్యం పెం చి, సభా గౌరవం మహిళలు సమాన హక్కు లు పొందుతున్నప్పుడే సమ సమాజ స్థాపన జరుగుతుందని భావించి 81వ రాజ్యాంగ సవరణ ద్వారా 1996 సెప్టెంబర్ 12న అప్ప టి ప్రధానమంత్రి హెచ్‌డే దేవెగౌడ ప్రభుత్వ మొదలుకొని 1998, 1999, 2008, 2010 పార్లమెంట్‌లోకి వచ్చి అన్ని పార్టీల ఆమో దం పొంది కూడా మహిళా బిల్లు చట్ట రూపం దాల్చలేదు.
ఎన్నో ప్రభుత్వాలు ప్రయత్నించి విఫలమైనప్పటికీ, ధృడ సంకల్ఫంతో మోదీ ప్రభుత్వం 128వ రాజ్యాంగ సవరణ ద్వారా 2023 సెప్టెంబర్ 19న లోక్‌సభలో ప్రవేశపెట్టి లోక్‌సభ, రాష్ట్ర విధాన సభలలో ఉన్న మొత్తం సీట్లలో 33% రిజర్వేషన్లు కల్పించేందుకు మంగళవారం (మార్చి 31న) పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించుకున్నదని తెలుస్తున్నది. ఇక్కడ గమనించాల్సిన విషయం బీజేపీ -ఎన్డీఏ వాజపేయ్ ప్రభుత్వం కూడా 1999, 2002, 2003-, 2004లలో మహిళా బిల్లు తీసుకురావడానికి ప్రయత్నంచి విఫలమైంది.
ఇక 2008లో యూపీఏ- హయాంలో కాంగ్రెస్ మన్మోహన్ సింగ్ ప్రభుత్వం 108వ రాజ్యాం గ సవరణ బిల్లు ద్వారా 2010 మార్చి 9న బీజేపీ, వాపపక్షాలు, జేడీయూల మద్దతుతో రాజ్యసభలో ఆమోదం పొందినప్పటికీ, 33 శాతం మహిళా బిల్లులు ఓబీసీ మహిళలకు కూడా రిజర్వేషన్లు ఉండాలని రాష్ట్రీయ జనతాదళ్, సమాజ్‌వాది పార్టీలు పట్టుబట్టడం తో ఈ బిల్లు లోక్‌సభలో ప్రవేశపెడితే కాం గ్రెస్ ఆధ్వర్యంలోని యూపీఏ ప్రభుత్వం పడిపోతుందని లోక్‌సభలో ప్రవేశపెట్టలేకపోయింది.
2014లో ప్రభుత్వం ప్రభుత్వం రద్దయినందువలన లోక్‌సభలో మహిళా బిల్లు కూడా రద్దయిపోయి, రాజ్యసభలో సజీవం గా ఉండిపోయింది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో మహిళా రిజర్వేషన్ బిల్లు ఉన్నప్పటికీ 2014 లో అధికారంలోకి వచ్చి పట్టించుకోలేదు. 2019లో రెండోసారి అధికారంలోకి వచ్చి కూడా పట్టించుకోలేకపోవడం గమనార్హం. 1975లో ఇందిరాగాంధీ ప్రభుత్వం ‘సమానత్వం వైపు’ అనే పేరుతో అన్ని రంగాలలో మహిళల స్థితిగతులపై, మహిళా రిజర్వేషన్లపై నివేదిక తయారు చేశారు.
కానీ నివేదిక తయారీలోని మెజారిటీ సభ్యులు మహిళా రిజర్వేషన్లు వ్యతిరేకించారు. ఎందుకంటే, మహిళలు స్వశక్తితో ఎదగాలి కానీ రిజర్వేషన్ల ద్వారా కాదని వాదించారు. ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీ ప్రభుత్వం స్థానిక సంస్థలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రయత్నించినప్పటికీ రాష్ట్రాల అసెం బ్లీలు వ్యతిరేకించాయి. 1993లో 73, 74వ రాజ్యాంగ సవరణల ద్వారా ప్రధానమంత్రి పీవీ నరసింహారావు ప్రభుత్వం స్థానిక సంస్థలలో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించింది.
మహిళలు కులం మాదిరిగా ఒక జాతి కానప్పుడు వారికి రిజర్వేషన్లు ఎలా వర్తిస్తా యి? అనే తార్కిక వాదనలు కూడా ఉన్నా యి. రిజర్వేషన్ల ద్వారా చట్టసభలలో మహిళలకు సీట్లు కేటాయించడం రాజ్యాంగం లోని సమానత్వ హక్కుకు విరుద్ధమని మరి కొందరు వాదిస్తున్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రకారం మహిళలకు కేటాయించే 33 శాతం రిజర్వేషన్లలో ఓబీసీ మహిళలకు కూడా కనీసం 33% రిజర్వేషన్ ఉండాలని మొదటినుంచి ఆర్జెడీ నేత లాలూప్రసాద్ యాదవ్, సమాజ్‌వాదీ పార్టీ నేత ములాయంసింగ్ యాదవ్ గట్టి వాదన వినిపించి బిల్లును అడ్డుకున్నారు.
అలాగే 1997లో మా ఓబీసీ మహిళలకు కూడా రిజర్వేషన్లు ఉండాల్సిందేనని జేడీయా నేత శరద్‌యాద వ్ గట్టిగా పట్టుబట్టారు. నిజానికి దేశవ్యాప్తం గా ఓబీసీల జనాభా 56%పైనే అలాంటప్పుడు దేశంలోని మహిళలందరిలో కూడా ఓబీసీ మహిళలు 56% పైనే ఉంటారు. మహిళా బిల్లు తీసుకువస్తే మళ్లీ.. అగ్రవర్ణాల మహిళా ప్రజాప్రతినిధులే తిష్ట వేసి మళ్లీ బీసీలకు అన్యాయం జరుగుతుందని, కాబట్టి ఎస్సీ, ఎస్టీ మహిళలకు ఉన్నట్లే ఓబీసీ మహిళలకు కూడా చట్ట సభలలో రిజర్వేషన్లు ఉం డాల్సిందేని మరి కొందరి వాదన.
నేటి సమాజంలో స్త్రీలను ఎన్నికలలో నిలబెట్టి గెలిపించుకొని వారిని రబ్బర్ స్టాం ప్‌గా మార్చి పెత్తనం మాత్రం పురుషులు చేలాయిస్తున్నారు. వారిని నామమాత్ర ప్రతినిధిగా కాకుండా బలమైన నేతలుగా తీర్చి దిద్దినప్పుడే నిజమైన మహిళా సాధికారత ఏర్పడుతుంది. 1998 బేస్ లైన్ సర్వే నివేదిక ప్రకారం కులం, వర్గం, లింగ వివక్షత, పితృస్వామ్య విధానాలు కొనసాగడం వల్ల మహి ళలు రాజకీయాలలో రాణించలేకపోతున్నారని పేర్కొన్నారు.
నేటికీ గ్రామస్థాయిలో మహిళల పేరిట ‘పతి ప్రధాన్/సర్పంచ్ పతి (సర్పంచ్ భర్త) అనే అనధికార పెత్తనం పురుషులు చేలాయిస్తున్నారనేది చేదునిజం. మహిళా బిల్లు అమలై మహిళలు ఎన్నుకోబడ్డ తర్వాత కూడా ‘మగువ పెత్తనం పోయి.. మగాడి పెత్తనం వస్తే’ ఇలాంటి వ్యవస్థ మళ్లీ పునరావృతం అయితే ఈ మహిళా బిల్లుకు అర్థం లేనట్లే. 2029 నుంచి అమలు కాబోతున్న ఈ మహిళా రిజర్వేషన్ల ఫలాలు మహి ళలకు చెందాలంటే..
లింగ సమానత్వం, మ హిళా సాధికారత, విధాన నిర్ణయాల్లో మగు వ మాట చెల్లాలంటే, రాజకీయాల్లో రాటుదేరాలంటే, పురుషులు మహిళలను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తే తప్ప ఈ బిల్లుకు అర్థం లేదు. ప్రజాస్వామ్యం ప్రగతిశీలం వైపు పోవాలంటే అది సమానమైన మహిళా భాగస్వామ్యం లేకుండా సాధ్యం కాదు. అందుకే చట్టసభల్లో ఓబీసీ మహిళలకు కూడా రిజర్వేషన్లు కల్పించినప్పుడే మహిళా సాధికారత సాకారం అవుతుంది. దేశ ఫలాలన్నీ అందరికీ సమానంగా అందాల్సిందే.
వ్యాసకర్త సెల్: 90004 81768




