2 June, 2026 | 2:54 AM

హెల్మెట్ వినియోగంపై విస్తృత అవగాహన

02-06-2026 01:16 AM
  1. మెడికవర్ ఆధ్వర్యంలో భారీ హెల్మెట్ శిల్పం ఏర్పాటు
  2. మెడికవర్ హాస్పిటల్స్, మల్కాజిగిరి కార్పొరేషన్ ఆధ్వర్యంలో కార్యక్రమం

సికిందరాబాద్, జూన్ 1(విజయక్రాంతి): రోడ్డు ప్రమాదాల కారణంగా సంభవిస్తున్న మరణాలు, తీవ్ర తల గాయాలను తగ్గించేందుకు హెల్మెట్ వినియోగంపై ప్రజల్లో అవ గాహన పెంపొందించే లక్ష్యంతో సోమవారంసికిందరాబాద్ మెడికవర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో భారీ హెల్మెట్ శిల్పాన్ని ఘనం గా ఆవిష్కరించారు. హెల్మెట్ ఆన్, వర్రీస్ గోన్ అనే సందేశంతో రూపొందించిన ఈ ప్రత్యేక శిల్పం నగర ప్రజలకు రోడ్డు భద్రతపై నిరంతర అవగాహన కల్పించే చిహ్నం గా నిలవనుంది.

మెడికవర్ హాస్పిటల్స్ సమీపంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి. వినయ్ కృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ బి. సుమతి ముఖ్య అతిథులుగా హాజరై శిల్పాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ద్విచక్ర వాహనదారు లు తప్పనిసరిగా నాణ్యమైన హెల్మెట్ ధరించడం ద్వారా ప్రాణాలను కాపాడుకోవచ్చ న్నారు.

మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు మాట్లాడుతూ, అ త్యవసర విభాగానికి వచ్చే ప్రమాద బాధితుల్లో చాలా మంది తలకు తీవ్ర గాయాల తో చేరుతున్నారని, హెల్మెట్ ధరించి ఉంటే వారి ప్రాణాలు, జీవన నాణ్యతను కాపాడే అవకాశం మరింత ఎక్కువగా ఉంటుందని వివరించారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి ట్రాఫిక్ డీసీపీ రాహుల్ రెడ్డి, మెడికవర్ హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ న్యూరోసర్జన్ డాక్టర్ రమేష్ శిఘాకోలి, హెడ్ ఆఫ్ క్రిటికల్ కేర్ డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం, సెంటర్ హెడ్ కృష్ణవేణి, ఆసుపత్రి వైద్యులు పాల్గొన్నారు.