8 May, 2026 | 1:57 AM

సల్మాన్‌తో తలపడేదెవరు?

08-05-2026 01:00 AM

బాలీవుడ్ స్టార్ సల్మాన్‌ఖా న్, టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబోలో భారీ చి త్రం రూపొందుతున్న సం గతి తెలిసిందే.  దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా షూ టింగ్ ముంబయిలో సాగుతోంది. ఈ షెడ్యూల్‌లో ఇటీవలే హీరోయిన్ నయనతార చేరారు.

ఇందులో విలన్ రోల్ విషయమై ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చ జరుగు తోంది. మాలీవుడ్ నటుడు ఫహద్ ఫాజి ల్ కానీ, బాలీవుడ్ స్టార్ అక్షయ్ ఖన్నా కానీ.. ఇద్దరిలో ఎవరో ఒకరిని తీసుకోవాలని టీమ్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఒక కీలక పాత్ర కోసం అరవింద్ స్వామిని ఎంపిక చేసుకున్న చిత్రబృందం.. సల్మాన్‌ఖాన్ స్క్రీన్ ప్రెజెన్స్‌కు సరిపోయే ప్రతి నాయకుడి పాత్రధారిని ఎంపిక చేసుకునేందుకు సమయం తీసుకుంటోందని సమాచారం. ఈ మూవీని 2027 ఈద్ సందర్భంగా విడుదల చేస్తామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.