19 July, 2026 | 4:14 AM

సిరీస్ చిక్కే దెవరికి?

19-07-2026 12:00 AM
  1. ఇవాళ భారత్, ఇంగ్లాండ్ చివరి వన్డే
  2. రోహిత్‌పైనే అందరి చూపు

లార్డ్స్, జూలై 18 : భారత్, ఇంగ్లాండ్ వన్డే సిరీస్ క్లుమైక్స్‌కు చేరింది. సిరీస్ ఫలితాన్ని తేల్చే చివరి మ్యాచ్ ఆదివారం లార్డ్స్ వేదికగా జరగబోతోంది. టీ20 సిరీస్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ ఎదురుచూస్తోంది. మరోవైపు తొలి మ్యాచ్‌లో ఓడినా తర్వాత పుంజుకుని సిరీస్‌ను సమం చేసి న ఇంగ్లాండ్ లార్డ్స్‌లోనూ గెలవాలని పట్టుదలగా ఉంది. ఈ సిరీస్ డిసైడర్‌లో అందరి చూపు రోహిత్‌శర్మపైనే ఉంది.

రిటైర్మెంట్ ప్రకటిస్తాడంటూ వార్తలు వచ్చిన నేపథ్యం లో బీసీసీఐ వాటిలో నిజం లేదని తేల్చేయడంతో రోహిత్ నుంచి ఫ్యాన్స్ భారీ ఇన్నిం గ్స్ కోరుకుంటున్నారు. భారత బ్యాటింగ్‌లో కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ ఫామ్‌లో ఉండడం కలిసొచ్చే అంశం. ఇదిలా ఉంటే స్టార్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయంతో దూరం కావడం ఎదురుదెబ్బగా చెప్పాలి.

మరోవైపు రెండో వన్డే విజయంతో ఇంగ్లాం డ్ ఉత్సాహంతో కవిహిస్తోంది. ఈ సిరీస్‌లో ఇంగ్లాండ్ బ్యాటింగ్ బలమంతా జో రూట్‌పైనే ఉంది. మొదటి రెండు వన్డేల్లో కలిపి రూట్ 175 పరుగులు చేశాడు. రూట్‌తో పాటు మిగిలిన బ్యాటర్లు ఫామ్‌లోకి వస్తే ఇంగ్లాండ్ భారీస్కోరు సాధించే అవకాశముంటుంది. డకెట్, బట్లర్, బ్రూక్‌పై అంచ నాలున్నాయి.