5 June, 2026 | 2:38 AM

కొత్త సారథి ఎవరో?

05-06-2026 12:32 AM
  1. టీ20 కెప్టెన్సీలో రేసులో ముగ్గురు
  2. శ్రేయాస్ వైపే సెలక్టర్ల మొగ్గు
  3. గంభీర్‌తో కుదరని అభిప్రాయం
  4. శనివారం ప్రకటించే అవకాశం

ముంబై, జూన్ 4 : భారత టీ ట్వంటీ జట్టుకు కొత్త కెప్టెన్ రాబోతున్నాడు. ప్రపంచకప్ గెలిపించిన సూర్యకుమార్‌ను తప్పిం చడం ఇక లాంఛనమే. సారథిగా సక్సెస్ అ యినప్పటకీ సూర్యకుమార్ వ్యక్తిగత ఫామ్ స్థాయికి తగినట్టు లేదు. దాదాపు ఏడాదిన్నర కాలంగా వరుస వైఫల్యాలతో సతమ తమవుతున్నాడు. కెప్టెన్ కాబట్టే జట్టులో ప్లేస్ ఉంటోందన్న అభిప్రాయం కూడా వినిపించింది. ఇటీవల ఐపీఎల్‌లోనూ సూర్యకు మార్ తీవ్రంగా నిరాశపరిచాడు.

మిస్టర్ 360గా అభిమానులు పిలుచుకునే సూర్యకుమార్ నుంచి అలాంటి ఇన్నింగ్స్ వచ్చి చా లా నెలలే అయింది. పైగా వయసు మీద పడుతున్న నేపథ్యంలో టీ20 జట్టు కెప్టెన్సీని యువ ఆటగాళ్లలో ఒకరికి అప్పగించాలని బీసీసీఐ భావిస్తోంది. దీనికి సంబంధించి రెం డు రోజుల్లో కీలక ప్రకటన వెలువడే అవకాశముంది. ప్రస్తుతం టీ20  కెప్టెన్సీ రేసులో మూడు పేర్లు వినిపిస్తున్నాయి. శ్రేయాస్ అ య్యర్, ఇషాన్ కిషన్‌తో పాటు తెలుగు కు ర్రాడు తిలక్ వర్మ రేసులో ఉన్నారు.

ఈ ము గ్గురిలో శ్రేయాస్ అయ్యర్ కాస్త ముందున్నాడు. సారథిగా శ్రేయాస్‌కు మంచి రికా ర్డుంది. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను ఛాంపియన్‌గా నిలిపిన అయ్యర్ గత ఏడాది పంజాబ్ కింగ్స్‌ను ఫైనల్‌కు చేర్చాడు. జట్టు ను నడిపించడంలో శ్రేయాస్‌కు మంచి మా ర్కులే పడ్డాయి. పైగా కెప్టెన్సీ ఒత్తిడి లేకుండా బ్యాటర్‌గానూ రాణిస్తున్నాడు. ఇది కూడా శ్రేయాస్‌ను కెప్టెన్సీలో రేసులో ముందు నిలబెట్టింది. ఇటీవల ముగిసిన ఐపీఎల్ సీజ న్‌లో శ్రేయాస్ 170కి పైగా స్ట్రైక్‌రేట్‌తో 498 పరుగులు చేశాడు. 

ఈ సానుకూల అంశాలతోనే బీసీసీఐ సెలక్షన్ కమిటీ శ్రేయాస్ వైపే మొగ్గుచూపుతున్నట్టు సమాచారం. అయితే దీనిపై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్  ఏకాభిప్రాయం కుదర్లేదని తెలుస్తోంది. గంభీర్ శ్రేయాస్ కంటే సంజా శాంసన్, ఇషాన్ కిష న్ పేర్లు ప్రతిపాదించినట్టు వార్తలు వస్తున్నా యి. హైదరాబాదీ బ్యాటర్ తిలక్ వర్మ పేరు కూడా చర్చకు వచ్చినట్టు బోర్డు వర్గాలు తెలిపాయి. దీనికి అజిత్ అగార్కర్ సారథ్యం లోని సెలక్షన్ కమిటీ అంగీకరించలేదనీ, శ్రేయాస్‌ను ఎంపిక చేద్దామని చెప్పినట్టు స మాచారం.

వచ్చే టీ20 ప్రపంచకప్‌ను దృష్టి లో ఉంచుకునే సారథిని ఎంపిక చేయనున్నట్టు తెలుస్తోంది. పదే పదే కెప్టెన్‌ను మార్చ డం జట్టులో ఉన్న మంచి వాతావరణంపై ప్రభావం చూపిస్తుందని సెలక్టర్లు భావిస్తున్నారు.ఈ నేపథ్యంలో గంభీర్‌తో మళ్లీ చ ర్చించి శనివారం అధికారిక ప్రకటన చేసే అవకాశాలున్నాయి. ఇదిలా ఉంటే ఆసియా క్రీడల కోసం కూడా అప్పుడే జట్టును ఎంపి క చేయనున్నారు. ఇప్పటికే ఆసియా గేమ్స్కు సంబంధించి ప్రాబబుల్స్‌లో సూర్య, గిల్‌కు చోటు దక్కలేదు.

ఆసియా గేమ్స్ కోసం పం పే జట్టులో సీనియర్లు ఎవరూ ఆడే అవకాశం లేదు. అయితే, ఇంగ్లాండ్‌తో పొట్టి సిరీస్‌కు మాత్రం పూర్తిస్థాయి జట్టు వెళ్లడం ఖాయమే. ఆప్ఘనిస్థాన్‌తో సిరీస్ ముగిసిన తర్వాత భారత్ షెడ్యూల్ ను చూస్తే జూన్ 26 నుంచి జూన్ 28 వరకు ఐర్లాండ్‌తో రెండు టీ20లు ఆడుతుంది. అనంతరం జులై 1 నుంచి జులై 19 వరకు ఇంగ్లాండ్ పర్యటనలో ఐదు టీ20లు ఆడనుంది. ఆ తర్వాత జులై 23 నుంచి 26 వరకు జింబాబ్వేతో మూడు టీ20ల సిరీస్, సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జపాన్ వేదికగా ఆసియా గేమ్స్‌లో పాల్గొంటుది.