12-02-2026 12:11:58 AM
శివ్వంపేట, ఫిబ్రవరి 11 :గత నాలుగు నె లల క్రితం జరిగిన దొంగతనం కేసులో దొం గలేవరో ఇంతవరకు దొరికింది లేదు. వివరాలలోకి వెళ్తే.. మండలంలోని పిల్లుట్ల గ్రా మంలో గత సంవత్సరం అక్టోబర్ 10న పి ల్లుట్ల గ్రామానికి చెందిన రిటైర్డ్ వీఆర్‌ఓ గం గుల కిష్టారెడ్డి ఇంటిలోకి రాత్రి సమయంలో ఇంటి కమాన్ పొయ్యిలో నుండి ఎవరో గు ర్తు తెలియని దొంగలు ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి,
ఇంట్లో దాచిన మూడు తులాల బంగారంతో పాటు రూ.60 వేల నగదును ఎత్తుకెళ్లారు. ఇంట్లో ఇద్దరే వృద్ధ దంపతులు ఉంటుండడంతో అదునుగా భావించిన దొంగలు పక్కా ప్రణాళికతోనే కిష్టారెడ్డి ఇం ట్లో దొంగలు దొంగతనం చేశారని విషయా న్ని గ్రామస్థులు పోలీసుల ద్రుష్టికి తీసుకెళ్లారు. దొంగతనం జరిగిన సమాచారాన్ని అందుకొని శివ్వంపేట ఎస్‌ఐ మధుకర్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక పోలీసులతో పాటు మెదక్ నుండి క్లూస్ టీం బృందం పిల్లుట్ల గ్రామానికి చేరుకొని, ఆధారాలతో పాటు, బీ రువాపై, ఇతర వస్తువులపై ఉన్న దొంగల వేలిముద్రలను సేకరించారు.
అయితే నాలు గు నెలలు గడిచినప్పటికి కూడా దొంగలు దొరికిన ఆనవాళ్లు మాత్రం లేవని గ్రామస్థు లు ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగు నెలలు గడిచిన దొంగలు దొరకడం లేదంటే ఇది నిందితుల చాకచక్యమా...పోలీసుల నిర్లక్ష్య మా అని గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అక్టోబర్ నెలలో గంగుల కిష్టారెడ్డి ఇంట్లో దొంగలు పడి బంగారంతో పా టు నగదు దోచుకెళ్లిన ఘటన మరువక ముందే గ్రామానికి చెందిన యశ్వంతారావుపేట భూషమ్మ ఇంటిలో,
వెంకట్రావుపేట ల చ్చయ్య ఇంటిలో కూడ దొంగలు పడి నగదును ఎత్తికెళ్లిన ఘటనలు చోటుచేసుకున్న ట్లు గ్రామస్థులు తెలిపారు. నిందితులను గుర్తించి తమకు పోలీసులు తగిన న్యాయం చేయాలనీ వృద్ధ దంపతులు కిష్టారెడ్డి, అనసూయ విజ్ఞప్తి చేశారు. ఇదే విషయమై ఎస్ ఐ మధుకర్ రెడ్డిని వివరణ కోరగా.. పిల్లుట్ల దొంగతనం కేసులో సమగ్ర విచారణ చేపట్టామని, నిందితులను త్వరలోనే పట్టుకుం టామని ఎస్‌ఐ తెలిపారు.