11 July, 2026 | 5:17 PM

ప్రతి గ్రామంలో ఎస్ఐఆర్ ప్రక్రియ వివరణకు యువత హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేయాలి

11-07-2026 04:22 PM

బోథ్,(విజయక్రాంతి): సోనాల మండలంలోని అన్ని గ్రామాలలో యూత్ కాంగ్రెస్ పార్టీ యువకులు ఎస్ఐఆర్ ప్రక్రియ వివరణ కోసం హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేయాలని నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు గుడాల అనీష్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నరేష్ యాదవ్ ఆదేశాల మేరకు మండలంలోని కోట కె గ్రామంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి బిఎల్ఓ లతో కలిసి ఓటర్లకు ఎస్ఐఆర్ పై అవగాహన కలిగించామన్నారు. బిఎల్వోలు సంగీత కాంగ్రెస్ పార్టీ బి ఎల్ ఏ పరశురాంతో కలిసి. సందేహాలను నివృత్తి చేసామన్నారు అన్ని గ్రామాలలో ఈ విధమైన హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లయితే సకాలంలో ప్రక్రియ పూర్తవుతుందని పేర్కొన్నారు కార్యక్రమంలో స్థానిక తహసిల్దార్ మల్లేశం డిటి ప్రేమ్ నివాస్ సర్పంచ్ పూజా సంఘం ఉప సర్పంచ్ గంగాసాగర్ మాధవ్ సెక్రటరీ విజయ్ తదితరులు పాల్గొన్నారు