11 July, 2026 | 5:11 PM

భూముల సర్వే, రీసర్వే ను పకడ్బందీగా నిర్వహించాలి

11-07-2026 04:11 PM

నిర్మల్,(విజయక్రాంతి): రాష్ట్రంలో భూముల సర్వే, రీసర్వే ను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం ఖమ్మం కలెక్టరేట్ నుంచి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భూముల సర్వే, రీసర్వే అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రెవెన్యూ మ్యాపులు లేని గ్రామాలకు మ్యాపులు తయారు చేసేందుకు  సర్వేను చేపట్టినట్లు వివరించారు.

ప్రతి జిల్లాలో ఎంపిక చేసిన 70 గ్రామాల్లో అత్యాధునిక సాంకేతికత వినియోగించి రీసర్వే నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ సర్వే, రీసర్వే ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలని చెప్పారు. కలెక్టర్లు స్వయంగా ప్రక్రియను పర్యవేక్షించాలని ఆదేశించారు. సర్వే, రీసర్వేలను వేగవంతంగా పూర్తి చేసేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని తెలిపారు. జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి ఈ వీసీలో జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, ఆర్డీవో దేవీదాస్, ల్యాండ్ సర్వేయర్ నరసింహ మూర్తి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.