త్రాగునీటి సమస్య పరిష్కారానికి ప్రత్యేక కృషి
11-07-2026 04:44 PM
గణపురం సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్
గణపురం,(విజయక్రాంతి): మండల కేంద్రంలో తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రత్యేక కృషి చేయనున్నట్లు గణపురం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్ అన్నారు. శనివారం అంగడి బజార్ హరిజన కాలనీలో మంచినీటి బోరును సర్పంచ్ కటుకూరి రాధిక శ్రీనివాస్ ప్రారంభించారు. గణపురం మండల కేంద్రంలోని అంగడి బజార్ ఎస్సీ కాలనీలో ప్రజల తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు సర్పంచ్ కటుకూరి రాధిక శ్రీనివాస్ ఆధ్వర్యంలో పది రోజుల క్రితం మంచినీటి బోరు వేయగా సమృద్ధిగా నీరు పడడంతో శనివారం నూతన బోరు మోటర్ ను ఏర్పాటు చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు సర్పంచ్ కటుకూరి రాధిక శ్రీనివాస్ కు కృతజ్ఞతలు తెలిపారు.






