11 July, 2026 | 5:10 PM

రాంనగర్‌లో ప్రపంచ జనాభా దినోత్సవం

11-07-2026 04:00 PM

నిర్మల్,(విజయక్రాంతి): ప్రపంచ జనాభా దినోత్సవ సందర్భంగా రామ్ నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం నిర్వహించారు. ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రాజేందర్ మాట్లాడుతూ జనాభా వల్ల ఎదురయ్యే ఇబ్బందుల గురించి సమస్యల గురించి పరిష్కార మార్గాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం జనాభా దినోత్సవం జరుపుకుంటామని తెలియజేశారు. ముఖ్యంగా తాత్కాలిక, శాశ్వత కుటుంబ నియంత్రణ పద్ధతుల గురించి, కాన్పుకు కాన్పుకు మధ్య దూరం గురించి, వివాహ వయసు గురించి, లింగ వివక్షత గురించి, మాతృత్వ సేవల ప్రాధాన్యత గురించి, ప్రజలందరికీ అవగాహన కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమానిర్వాహణాధికారి డాక్టర్ సౌమ్య డిప్యూటీ జిల్లా విస్తరణ మరియు మీడియా అధికారి బారె రవీందర్, ఆరోగ్య పర్యవేక్షకులు మతిన్, శ్రీనివాసరెడ్డి కమ్యూనిటీ ఆర్గనైజర్ రమణ ఆరోగ్య సహాయకులు మరియు ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.