8 March, 2026 | 4:59 AM

చెత్త కష్టాలకు వాట్సాప్‌తో చెక్

08-03-2026 12:00 AM
  1. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సీఎంసీ సరికొత్త చొరవ 
  2. పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజలు సహకరించాలి: కమిషనర్ సృజన  

హైదరాబాద్ సిటీ బ్యూరో, మార్చి ౭ (విజయక్రాంతి) :సైబరాబాద్ మున్సిపల్ కా ర్పొరేషన్ సీఎంసీ పరిధిలో నివసిస్తున్న నగ ర పౌరుల చెత్త కష్టాలు ఇక సులువుగా తీరనున్నాయి. వీధుల్లో పేరుకుపోతున్న చెత్తాచె దారం, పొంగిపొర్లుతున్న చెత్త కుండీల గార్బే జ్ బిన్స్ సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవ సరం లేకుండానే సీఎంసీ కమిషనర్ జి. సృజన ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

పారిశుద్ధ్య సమస్యలపై ప్రజలు నేరుగా ఫిర్యాదు చేసేందుకు, ఆ సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు వీలుగా కార్పొరేషన్ తరఫున ఒక ప్రత్యేక వాట్సాప్ నంబర్‌ను 9063421347 ఆమె అందుబాటులోకి తీసుకువచ్చారు. తమ పరిసరాల్లో ఎక్కడైనా అక్రమంగా చెత్త డంప్ చేసినట్లు గుర్తిస్తే లేదా రోడ్లు, బహిరంగ ప్రదేశాల్లో చెత్త కుండీలు నిండిపోయి పారిశుద్ధ్య లోపం నెలకొంటే స్థానికులు తక్షణమే ఈ నంబర్కు ఫిర్యాదు చేయొచ్చు.

సమస్య ఉన్న చోట ప్రజలు కేవలం తమ మొబైల్ ఫోన్ నుంచి ఒక ఫోటో తీసి, ఆ ఫోటోతో పాటు కచ్చితమైన లొకేషన్‌ను సదరు వాట్సాప్ నంబర్ కు మెసేజ్ చేస్తే సరిపోతుంది. ఈ ఫిర్యాదు లు, లొకేషన్ వివరాలు నేరుగా సంబంధిత పారిశుద్ధ్య విభాగం అధికారులకు చేరుతా యి. అధికారులు వెంటనే అప్రమత్తమై క్షేత్రస్థాయి సిబ్బంది ద్వారా ఆ చెత్తను తొలగిస్తా రు.

ఈ నూతన విధానం వల్ల ఫిర్యాదుల నమోదు ప్రక్రియ ఎంతో సులభతరం కావడమే కాకుండా, అధికారుల స్పందన, సమ స్య పరిష్కారం కూడా చాలా వేగంగా జరుగుతుందని కమిషనర్ జి. సృజన స్పష్టం చేశారు. సైబరాబాద్‌ను మరింత పరిశుభ్రమైన, సుందరమైన నగరంగా తీర్చిదిద్దేందు కు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి, ఈ వాట్సాప్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు.