భారత్ ఏది కోరినా ఇచ్చేస్తాం
25-05-2026 12:49 AM
నేను మోదీకి పెద్ద అభిమానిని: ట్రంప్
న్యూఢిల్లీ, మే ౨౪: భారతదేశం ఏది కోరినా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఉద్ఘాటించారు. భారత్‌కు ఒక్క ఫోన్ కాల్ దూరంలో ఉంటామని చమత్కరించారు. న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ వేదికగా ఆదివారం ఆ దేశ విదేశాంగ మంత్రి రుబియోతో ప్రధాని మోదీ భేటీ సందర్భంగా ట్రంప్ ఫోన్‌కాల్ ద్వారా లైవ్‌లోకి వచ్చి మాట్లాడారు.
తాను మోదీకి పెద్ద అభిమానిని, తనకు మంచి మి త్రుడంటూ ట్రంప్ అన్నారు. తమ దేశానికి భారత్ ౧౦౦శాతం నమ్మకమైన భాగస్వామి అని ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ, స్టాక్‌మార్కెట్ ప్రస్తుతం రికార్డు స్థాయిలో ఉన్నాయన్నారు. ఆ వ్యాఖ్యలపై మోదీ స్పందిస్తూ.. ట్రంప్ తనపై చూపిన అభిమానానికి ధన్యవాదాలు తెలిపారు.






