23 April, 2026 | 4:23 PM

జనగామలో చార్టెడ్ అకౌంటర్లకు చారిటబుల్ ట్రస్టులకు సంబంధం ఏమిటి?

23-04-2026 03:01 PM

జనగామ, (విజయక్రాంతి): జనగామజిల్లాలో చారిటబుల్ ట్రస్టుల పేరుతో నిధుల వినియోగంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయా? రూపాయలు కొన్ని కోట్ల సి ఎస్ ఆర్ ఫండ్స్ నిజంగా సేవా కార్యక్రమాలకు ఖర్చయ్యాయా? లేక ఇతర మార్గాలకు మళ్లించబడ్డాయా ఈ నిధులు పొందిన ట్రస్టులు సక్రమంగా నమోదు చేయబడ్డవేనా వాటి కార్యకలాపాలు పారదర్శకంగా ఉన్నాయా? పేపర్‌పైనే సంస్థలుఅనుమానాలు ఎందుకు వ్యక్తమవుతున్నాయి ఫార్మా ప్రవేట్ రంగాలు,పాఠశాలలు,అనాథాశ్రమాల పేరుతో పొందిన నిధులు నిజంగా లబ్ధిదారులకు చేరాయా లేదా కేవలం రికార్డులకే పరిమితమైపోయాయా ఫార్మా కంపెనీలతో అనుబంధం చూపుతూ నిధుల ప్రవాహం జరిగిందా ఉంటే ఆ లావాదేవీలు నిబంధనలకు అనుగుణంగానే జరిగాయా సిఎస్ఆర్ నిధుల వినియోగం పై సంబంధిత సంస్థలు సమగ్ర వివరాలు వెల్లడించాయా ఫార్మా కంపెనీలకు మరియు ట్రస్ట్ లకు మధ్య బ్యాంకర్లు సహాయం ఉన్నదా? ఈ వ్యవహారంపై ఇప్పటివరకు ఎలాంటి అరెస్టులు జరగకపోవడానికి కారణమేంటి? పూర్తిస్థాయి విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందా? సంబంధిత అధికారులు, ఆడిట్ విభాగాలు ఈ అంశంపై దృష్టి సారించాయా పోలీసులు లేదా ఇతర దర్యాప్తు సంస్థలు విచారణ ప్రారంభిస్తాయా? ప్రజల నిధుల వినియోగంపై స్పష్టత కోసం బాధ్యులు ముందుకు వచ్చి వివరణ ఇవ్వాలా పారదర్శకత కోసం ప్రత్యేక దర్యాప్తు కమిటీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందా ఈ అంశంపై సంబంధిత విభాగాలు దృష్టి సారించి పారదర్శకంగా విచారణ నిర్వహిస్తాయా అన్నది ఇప్పుడు కీలకంగా మారింది.. హవాలా మార్గంలో కొందరు రియల్టర్స్ ,ఉన్నట్టు  ప్రజలకు అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి.