9 May, 2026 | 2:33 PM

Breaking News

బొంద పెట్టడానికి స్థలం లేదు..!   •   రాష్ట్ర ప్రభుత్వం పంట కొనుగోళ్ల కోసం చిత్తశుద్ధితో పని చేస్తుంది   •   తడిసిన ప్రతి గింజ కొనాలి.. ఎకరానికి 20 క్వింటాళ్ల జొన్న కొనుగోలు చేపట్టాలి: ఎమ్మెల్యే   •   పేద ప్రజల సొంత ఇంటి కలలు నిజం చేస్తాం   •   ఆడబిడ్డ పెళ్లికి రూ.50,000 సాయం   •   మాటల ప్రభుత్వం కాదు.. మాది చేతల ప్రభుత్వం   •   అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన బిజెపి నాయకులు తంబళ్ల రవి   •   తమిళనాడులో రాజకీయ సంక్షోభం.. హైదరాబాద్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు   •   నిర్బంధ రాజకీయాలకు ముగింపు పలకాలి   •   కాంగ్రెస్ నాయకత్వ చర్చల నడుమ — కేరళ సీఎంపై కొనసాగుతున్న ఉత్కంఠ   •  

ఆరు గ్యారెంటీల హామీల అమలేది?

27-02-2026 12:25 AM

మానకొండూరు, ఫిబ్రవరి 26 (విజయక్రాంతి)రైతు సంక్షేమ రాజ్యం తెస్తామని చెప్పి, గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ హామీలను మరచి రైతన్నలను అరిగోస పెడుతూ అష్ట కష్టాలకు గు రిచేస్తుందని మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారాస హాయంలో రైతు భరోసా, రైతుభీమా లాంటి ఆర్థిక పథకాలతో పాటు, చెరువులను, కా లువలను, మరమ్మత్తులు చేసి, నీటి వసతులు కల్పించి రైతు రాజ్యం, రామరాజ్యానికి కృషి చేశామని చెప్పారు. యూరియా కోసం, యాప్ తో బుకింగ్ ద్వారా యూరియా సరఫరా పై ఆయన మండిపడ్డారు.

ఎంతమంది రైతులకు ఈ యాప్ పై అవగాహన ఉంటుందని ప్రశ్నించారు. గురువారం మానకొండూరులోని నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో పార్టీ మండలాధ్యక్షుడు తా ళ్లపల్లి శేఖర్ గౌడ్, సర్పంచులు ఎరుకల శ్రీనివాస్ గౌడ్ , వెన్న అనిల్, పిట్టల మధు, నెల్లి మురళి, బోడ రాజశేఖర్ తదితరులతో కలిసి ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో రసమయి మా ట్లాడారు. పంట పొలాల్లో పనిచేసే అన్నదాతలను నడివీధిలో నిలబెట్టిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అని ఎద్దేవ చేశారు. నియోజకవర్గంలో అక్రమాలు, అవినీతి, ప్రకృతి విధ్వంసం దేనికి సంకేతమని మీడియా సాక్షిగా నిలదీశారు.

ఇల్లంతకుంట, బెజ్జంకి, తిమ్మాపూర్, శంకరపట్నం తదితర మండలాలలో సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీలలో జరిగిన అవకతలపై తక్షణం విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ఊటూరు, కొత్తపల్లి, క్వారీలు ఖాళీ అయ్యాయని, మైలారం బండలు ఏమయ్యాయని వ్యంగ్యంగా ప్రశ్నించారు. తారు రోడ్లు, మట్టి రోడ్లు అయ్యాయని ని యోజకవర్గంలో వసూళ్ల పర్వం కొనసాగుతుందని ఆరోపించారు. సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీలో జరిగిన మాయాజాలంలో చర్యలు లేకుంటే , త్వరలో సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూ పొందించి బాధ్యులపై కఠిన చర్యలకు డిమాండ్ చేస్తూ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని రసమయి తేల్చి చెప్పారు.