9 May, 2026 | 3:31 PM

Breaking News

బంద్ విజయవంతం చేసిన ప్రజలకు ధన్యవాదాలు   •   బండి సంజయ్ కొడుకుపై పోక్సో కేసు.. స్పందించిన సబితా ఇంద్రారెడ్డి   •   రేపు హైదరాబాద్‌కు ప్రధాని మోదీ.. పర్యటన షెడ్యూల్‌ ఇదే..!   •   వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా సహకార అధికారి రామ్మోహన్ రావు   •   సొసైటీ అసిస్టెంట్ మృతుడు కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత   •   VOAల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా   •   సచివాలయంలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశం   •   శ్రీశైలంలో మరో సైబర్ మోసం.. ఢిల్లీ భక్తులకు టోకరా   •   బొంద పెట్టడానికి స్థలం లేదు..!   •   రాష్ట్ర ప్రభుత్వం పంట కొనుగోళ్ల కోసం చిత్తశుద్ధితో పని చేస్తుంది   •  

తడిసిన ప్రతి గింజ కొనాలి.. ఎకరానికి 20 క్వింటాళ్ల జొన్న కొనుగోలు చేపట్టాలి: ఎమ్మెల్యే

09-05-2026 02:25 PM

బోథ్,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం రైతుల పండించిన చివరి గింజ వరకు పంట కొనుగోలు చేపట్టాలని అంతేగాక ఎకరానికి 20 కింటల్లా జొన్న పంటను కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే జాదవ్ అనిల్ ప్రభుత్వాన్ని కోరారు. మండలంలోని ధన్నూర్ గ్రామంలో రైతుల కోరిక మేరకు శనివారం జొన్న పంట కొనుగోలను చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సరైన సమయంలో పంటలు కొనుగోలు చేయకపోవడం వల్ల రైతులు నష్టపోతున్నారు అన్నారు.

అంతేగాక అగ్ని ప్రమాదాల వల్ల వంట నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అందుకుగాను ప్రత్యేక ప్యాకేజీ ద్వారా ఆదుకోవాలని అన్నారు. నియోజకవర్గంలో అన్నిచోట్ల జొన్న కొనుగోలు చేపట్టడం జరుగుతుందన్నారు రైతులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ హేల్మ రోహిణి వినయ్ రెడ్డి తోపాటు ఆత్మ చైర్మన్ గొర్ల రాజు యాదవ్ సొసైటీ చైర్మన్ కదం ప్రశాంత్ పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు