4 May, 2026 | 9:54 PM

గంజాయి కేసులో పరారీలో ఉన్న నిందితుడి అరెస్ట్

04-05-2026 08:46 PM

కొత్తగూడెం,(విజయక్రాంతి): అక్టోబర్ నెలలో సుజాతనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 498 కేజీల ఎండు గంజాయి కలిగిన లారీ కంటైనర్, పట్టుకొని ఇద్దరు నిందితులైన జగదీష్ దయారాం పాటిల్, లారీ డ్రైవర్ సంజు కుమార్ లను సుజాతనగర్ పోలీసు పట్టుకుని, రిమాండ్కు పంపించడం జరిగింది. ఇట్టి కేసులో పరారీలో ఉన్న గంజాయిని ఒడిస్సా రాష్ట్రంలోని జైపూర్ చెందిన వ్యక్తి వద్ద నుండి కొని లారీ  కంటైనర్ లో పెట్టి, తరలించన మూడవ ముద్దాయి అయిన మహారాష్ట్ర కు చెందిన అమిత్ రోహిదాస్ పాటిల్ ను సోమవారం రోజున, సుజాతనగర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ రమాదేవి  పట్టుకొని, కేసు దర్యాప్తు అధికారి చుంచుపల్లి సీఐ వెంకటేశ్వర్లు  రిమాండ్ కు తరలించడం జరిగింది. గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలను కొనడం, అమ్మడం, కలిగి ఉండడం,  తాగడం, రవాణాచేయడం చట్టరీత్యా నేరం అట్టి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోబడును అని సుజాతనగర్ పోలీస్ పత్రికా ప్రకటన ద్వారా తెలియజేశారు.