సంక్షేమ వారోత్సవ కార్యక్రమం
కొత్తపల్లి, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ’ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో కరీంనగర్ నగరపాలక సంస్థ ఆద్వర్యంలో ‘వెల్ఫేర్ వీక్‘ ( సంక్షేమ వారోత్సవం) బుధవారం రోజున నగరంలోని కాశ్మీర్ గడ్డ ఉమెన్స్ డిగ్రీ కళాశాల సమీపంలో గల ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్ లో ప్రత్యేక పారిశుధ్య పనులు నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఎస్సీ హాస్టల్ పరిసరాలను తనిఖీ చేసి,హాస్టల్ వి ద్యార్థుల గదులతో పాటు మౌలిక సదుపాయాలను పరిశీలిస్తూ హాస్టల్ ఆవరణలో పారిశుధ్య కార్మికులు సిబ్బందితో కలిసి పరిశుభ్రత పనులను నిర్వహిస్తూ, చెత్తాచెదారం, కలుపు మొక్కలు తొలగించారు.
హాస్టల్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని హాస్టల్ సిబ్బందికి ఆదేశించారు. ఈ సందర్భంగా కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ మాట్లాడుతూ విద్యార్థులు పరిశుభ్రమైన వాతావరణంలో పెరిగినప్పుడే చదువు పై శ్రద్ద చూప గలరన్నారు. వెల్ఫేర్ హాస్టల్స్ అధికారులు, సిబ్బంది మీ హాస్టల్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో అదనపు కమీషనర్ సువార్త, వెటర్నరి అధికారి దుర్గాప్రసాద్ రెడ్డి, ఎంహె చ్ ఓ సుమన్, సానిటేషన్ సూపర్ వైజర్లు శ్యామ్ రాజ్, అనిల్, ఎస్త్స్ర వెంకన్న, హాస్టల్ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.






