19 April, 2026 | 4:04 AM

20 నుంచి 26 వరకు వెల్ఫేర్ వీక్

19-04-2026 12:32 AM

‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’పై సమీక్షలో సీఎస్

హైదరాబాద్, ఏప్రిల్ 18 (విజయక్రాంతి): ప్రజాపాలన ప్రగతి 99 రోజుల ప్రణాళికలో భాగంగా కార్య క్రమం అమలు తీరుపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు శనివారం సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 20 నుంచి ఏప్రిల్ 26 వరకు రాష్ట్రవ్యాప్తంగా వెల్ఫేర్ వీక్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా స్పెషల్ చీఫ్ సెక్రెటరీ సబ్యసాచి ఘోష్ రోజువారీ షెడ్యూల్‌ను వివరించారు. 

వెల్ఫేర్ వీక్ షెడ్యూల్..

- ఏప్రిల్ 20: అన్ని వెల్ఫేర్ విద్యాసంస్థల్లో వంటశాలలు, శానిటేషన్‌పై సమగ్ర శుభ్రత కార్యక్రమాన్ని నిర్వ హించాలి. అధికారులు విద్యాసంస్థలను సందర్శించి పరిశుభ్రత ప్రమాణాలను పరిశీలించాలి.

- ఏప్రిల్ 21: వెల్ఫేర్ విద్యార్థుల కోసం క్విజ్, డిబెట్, చిత్రలేఖనం వంటి పోటీలతో టాలెంట్ ఫెస్ట్ నిర్వహించి సృజనాత్మకతను, మేథస్సును ప్రోత్సహించాలి. 

- ఏప్రిల్ 22: హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో అవసరమైన మరమ్మతులపై దృష్టి పెట్టి అంచనాలు సిద్ధం చేసి, తగిన అనుమతులు తీసుకుని, వేసవి సెలవుల్లో పనులను పూర్తి చేయాలి.

- ఏప్రిల్ 23: తల్లిదండ్రులు- సమావేశాలు నిర్వహించి ప్రతిభావంతులైన విద్యార్థులను సత్కరించాలి. విద్యా ప్రతిభను ప్రోత్సహించాలి. 

- ఏప్రిల్ 24: యువత కోసం నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించి, ఉపాధి అవకాశాలను పెంపొం దించే ప్రభుత్వ పథకాలను వివరించాలి. 

- ఏప్రిల్ 25: విద్యార్థుల కోసం క్రీడలు, కళలు, సంగీ తం, డిజిటల్ లిటరసీ, వ్యక్తిత్వ వికాసం వంటి అంశాలతో సమ్మర్ క్యాంపులు నిర్వహించాలి. 

- ఏప్రిల్ 26: రాష్ట్రవ్యాప్తంగా అన్ని హాస్టళ్లలో, రెసిడెన్షియల్ పాఠశాలల్లో బడిబాట కార్యక్రమం నిర్వ హించాలి.