23 March, 2026 | 1:25 PM

ఉద్యోగుల హెల్ట్స్ స్కీం అమలు ప్రకటనను స్వాగతిస్తున్నాం

23-03-2026 11:07 AM

కానీ ఉపాధ్యాయ ఉద్యోగులకు అనుకూలంగా మార్పులు చేయాలి 

రాష్ట్ర పీఆర్టీయూ  పునః నిర్మాణ కమిటీ కన్వీనర్ కమిటీ కర్రు సురేష్ 

మంథని,(విజయక్రాంతి): గత ప్రభుత్వంలో అమలుకాక ఉద్యోగ, ఉపాధ్యాయులుగా ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఈ నగదు రహిత ఆరోగ్య పథకాన్ని అమలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్ర పీఆర్టీయూ  పునః నిర్మాణ కమిటీ కన్వీనర్  కర్రు సురేష్ ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. ఈ పథకాన్ని అందరికీ ఆమోదయోగ్యంగా ప్రభుత్వం అమలుపర్చాలని కోరారు. ఉద్యోగ, ఉపాధ్యాయల నుండి ఆరోగ్య పథకం గురించి ప్రతి నెల వారి వేతనం నుండి  మినహాయింపు ను రూ.500 కు పరిమితం చేయాలని, అత్యవసర సమయాల్లో అందుబాటులో ఉన్న భారత దేశంలోని ఏ ఆసుపత్రి లోనైనా  హెల్త్ కార్డ్ వినియోగించుకొని నగదు రహిత వైద్యం పొందేలా ఉండాలని ఆయన సూచించారు.

ఈహెచ్ ఎస్  పథకానికి రాజీవ్ ఆరోగ్య ట్రస్ట్ ద్వారా నిర్వహణ కాకుండా ఉద్యోగ, ఉపాధ్యాయులు, అధికారులు, వైద్య నిపుణులు తో కూడిన సభ్యులున్న ప్రత్యేక ట్రస్ట్ ఏర్పాటు చేయాలని కోరారు. హాస్పిటల్ లకు చెల్లింపులు ప్రస్తుత రాజీవ్ ఆరోగ్య శ్రీ స్లాబ్ రేట్లు సబబు కాదని, ఈ చెల్లింపు సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీం (CGHS-2026)ప్రకారం వుంటూ ప్రతి సంవత్సరం మారే స్లాబ్స్ ప్రకారం అమలు చేసినపుడు మాత్రమే ఉద్యోగ, ఉపాధ్యాయులకు మెరుగైన వైద్యం అందుతుందని సురేష్ తెలియజేశారు.