11 April, 2026 | 3:30 PM

Breaking News

ఇప్పుడు ఎన్నికలు జరిగినా... కాంగ్రెస్‌కు 100 సీట్లు ఖాయం   •   కలెక్టర్ కార్యాలయంలో పూలే జయంతి వేడుకలు   •   జ్యోతిరావు పూలే జయంతి ఆశయ సాధన కోసం కృషి చేయాలి   •   20న జగిత్యాలలో కేసీఆర్ సభ... జీవన్ రెడ్డి చేరిక — బీఆర్ఎస్ పార్టీకి మరింత బలం   •   లబ్ధిదారులకు కుట్టు మిషన్ల పంపిణీ   •   సారంపల్లిలో శిరీష వివాహానికి కరీంనగర్ డెయిరీ పుస్తెమట్టెలు అందజేత   •   మొక్కజొన్న పంటను ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలోని విక్రయించాలి   •   నాకు నమ్మకం ఉంది.. వచ్చేది మా ప్రభుత్వమే: కేటీఆర్   •   నిర్మల్‌లో నిరసన తెలుపుతున్న నాయకులు   •   అతిధి అధ్యాపకుల సర్వీసును 2026-27 విద్యా సంవత్సరానికి కొనసాగించాలి   •  

దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తా

19-02-2026 01:59 AM

డాక్టర్ జి. మధుసూదన్‌రెడ్డి

నారాయణపేట.ఫిబ్రవరి 18(విజయక్రాంతి): దేవాలయాల అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని డాక్టర్ గవినోల్ల మధుసూదన్ రెడ్డిఅన్నారు. బుధవారం నారాయణపేట మండల పరిధిలోని జాజాపూర్ గ్రామంలోని దేవాలయాల అభివృద్ధికి రూ. 1.16 లక్షల విరాళం అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవాలయాల అభివృద్ధి కోసం గవినోళ్ల రాములమ్మ కుటుంబ సభ్యులు డాక్టర్ మధుసూదన్ రెడ్డి తమ వంతు సహకారం చేస్తామన్నారు. అభివృద్ధి కోసం తన శక్తివంచన లేకుండా ఆర్థిక సహాయాన్ని అందించి ఆలయాల అభివృద్ధి కోసం కృషి చేయడం తనకు ఎంతో సంతోషాన్ని ఇస్తుందని అన్నారు. గతంలో గ్రామంలోని మెయిన్ చౌరస్తాలో ఉన్న శ్రీ చౌడేశ్వరి మాత దేవాలయానికి లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించి ఆలయ అభివృద్ధి కోసం కృషి చేయడం జరిగిందని గుర్తు చేశారు. గ్రామంలోని హనుమాన్ దేవాలయానికి మూడు లక్షల రూపాయలతో ఆలయం ముందు ధజస్తంభానికి ఆర్థిక సాయం చేయడం జరిగిందని తెలిపారు.

గతంలో మండల పరిధిలోని అప్పిరెడ్డిపల్లి గ్రామంలో రామాలయ దేవాలయానికి లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేయడంతో ఆలయ కమిటీ సభ్యులు కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలో ఆయా దేవాలయాల అభివృద్ధి చేయడంలో తన వంతు కృషి చేయడం జరుగుతుందన్నారు. రాబోయే రోజుల్లో దేవాలయాల అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు గ్రామంలో తన వంతుగా చేయూతని అందించేందుకు ముందుంటానని ఆయన గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో లక్ష్మమ్మ దేవాలయ కమిటీ సభ్యులు, గవినోళ్ల కుటుంబ సభ్యులు వార్డు సభ్యులు శ్రీధర్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి లతోపాటు గ్రామస్తులు పాల్గొన్నారు