27 March, 2026 | 3:21 AM

ప్రత్యేక చర్యలు తీసుకుంటాం

27-03-2026 12:00 AM

గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి

అబ్దుల్లాపూర్మెట్, మార్చి 26: మామిడి సీజన్లో రైతులు ఎలాంటి ఇబ్బందులకు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి అన్నారు. బాటసింగారం పండ్ల మార్కెట్ ఆఫీసులో గురువారం మామి డి సీజ న్ దృష్ట్యా రైతులు, వర్తకులు, సంబంధిత అధికారులతో కలిసి సమన్వయ సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.. మామిడి పండ్లను మార్కెట్ తీసుకొచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

అలాగే రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని వర్తకులను కోరారు. రైతులకు అండగా పాలకవర్గం ఉంటుందని.. వారికి మార్కెట్ లో విశ్రాంతి గదులు కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చే యాలని సూచించారు. భారీ సంఖ్యలో వాహనాలు వస్తున్నందున ట్రాఫిక్ సమస్య తలెత్త కుండా చూడాలన్నారు. అవసరమైతే పోలీస్ అవుట్ పోస్టు ఏర్పాటు చేసి.. సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామన్నారు. రోడ్డు మరమత్తులు శానిటేషన్ పనులు చేపడతామన్నారు.

మామిడి పండ్లకు కల్తీ రసాయనాలు వాడొద్దని.. వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ఆమోదిం చిన ఇథలీన్ పదార్థాలను వాడాలని సూచించారు. రైతులను ఇబ్బందులకు గురిచేసే వ్యా పారులపై చర్యలుంటాయన్నారు. నిఘా, విజిలెన్స్ విభాగం ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తామన్నారు. గత ఏడాది ఒక లక్ష నలభై వేల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చిందని.. ఈ ఏడాది దాన్నిమించుతాయని అన్నారు. రైతుల సంక్షేమo కోసం ప్రభుత్వం కృషి చేస్తందన్నారు. కార్యక్రమంలో ఫుడ్ సేఫ్టీ, ఐపీఎం, పోలీస్, ట్రాఫిక్, ఫైర్ సంబంధించిన అధికారు లు, వైస్ చైర్మన్ సీహెచ్. భాస్కరచారి డైరెక్టర్లు  జైపాల్ రెడ్డి, బండి మధుసూదన్ రావు, రఘుపతి రెడ్డి, అంజయ్య, నవరాజ్, లక్ష్మి, గణేశ్ నాయక్, గోవర్ధన్ రెడ్డి, వెంకటేశ్వర్లు గుప్తా, ఇబ్రహీం, మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి ఎల్.శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు.