13 August, 2026 | 5:32 AM

సాయి కుటుంబాన్ని ఆదుకుంటాం

13-08-2026 12:27 AM

ఎమ్మెల్యే రంగారెడ్డి హామీ

ఇబ్రహీంపట్నం, ఆగస్టు 12 (విజయక్రాంతి): అర్ధాంతరంగా తనువు చాలించిన బండాలేమూర్ గ్రామానికి చెందిన కానిస్టేబుల్ సాయి ఆత్మహత్య ఘటనపై ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో ఆందోళనకు దిగిన కు టుంబసభ్యులు, బంధువులతో.. ఉన్నతాధికారులతో మాట్లాడారు.

విధి నిర్వహణలో సాయిని ఇబ్బందికి గురిచేశారన్న ఆరోపణలపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై కఠిన  చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సాయి  కుటుంబంలో ఒ కరికి ఉద్యోగం ఇప్పించేలా కృషి చేస్తామని తెలిపారు. అలాగే తక్షణ సాయం కింద రూ.10 లక్షలు అందజేస్తామన్నారు. సాయి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరుతో పాటు అతడి తండ్రికి పెన్షన్ వచ్చేలా కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.